- రూ. 12.86 లక్షలతో ధరలు ప్రారంభం
- V మరియు VX వేరియంట్స్ లో లభ్యం
హోండా కార్స్ ఇండియా ఇటీవల దాని ఏకైక ఎస్‌యువి ఎలివేట్ లిమిటెడ్ ‘అపెక్స్ ఎడిషన్’ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ ఎలివేట్ V మరియు VX వేరియంట్‌లలో అందించబడుతుంది. దీనిని రూ.12.86 లక్షలుఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, లాంచ్ అయిన తర్వాత, ఈ మోడల్ ఇండియా అంతటా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం కూడా ప్రారంభమైంది.
ఎలివేట్ అపెక్స్ ఎడిషన్‌లో ‘అపెక్స్’ బ్యాడ్జ్, క్లాడింగ్‌లపై పియానో బ్లాక్ ఫినిషింగ్, డ్యూయల్-టోన్ ఐవరీ మరియు బ్లాక్ ఇంటీరియర్, లెథెరెట్ డోర్ లైనింగ్ మరియు ఐపి ప్యానెల్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కొత్త ఎడిషన్‌తో, ఎలివేట్ ఇప్పుడు కస్టమైజ్డ్ యాంబియంట్ లైటింగ్ మరియు అపెక్స్ ఎడిషన్-స్పెసిఫిక్ సీట్ కవర్స్ మరియు కుషన్‌లను పొందుతుంది. ఈ అప్‌గ్రేడ్‌లన్నింటికీ స్టాండర్డ్ వెర్షన్ కంటే ధర రూ. 15,000 ఎక్కువ ఉంటుంది.
మెకానికల్‍గా, హోండా ఎలివేట్ 1.5-లైట్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. మరో వైపు, ఎస్‌యువి అపెక్స్ ఎడిషన్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో అందించబడుతోంది.
వేరియంట్ వారీగా హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
V MT | రూ. 12.86 లక్షలు |
V CVT | రూ. 13.86 లక్షలు |
VX MT | రూ. 14.25 లక్షలు |
VX CVT | రూ. 15.25 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప