- ఆసక్తికరమైన మార్పులను కలిగి ఉన్న మోడల్
- రూ. 12.86 లక్షల ప్రారంభ ధరలు
ఈ పండుగ సీజన్ లో హోండా ఇటీవల కొత్త ఎలివేట్ స్పెషల్ ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ అని పిలవబడే ఈ కారును, కార్‌మేకర్ 4 వేరియంట్‌లలో రూ. 12.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, కొనుగోలుదారులకు మరింత అవగాహన కలిగి ఉండేదుకు ఎస్‌యువిలోని ఉన్న మార్పులను వివరించే అన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.
హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ ఇమేజ్ గ్యాలరీ
కొత్త అపెక్స్ ఎడిషన్ ఎలివేట్ V మరియు VX వేరియంట్‌లపై ఆధారపడి ఉంటుంది. బయటి వైపు, ఈ స్పెషల్ ఎడిషన్ పియానో బ్లాక్ ఎక్స్‌టీరియర్ యాడ్-ఆన్‌లను కలిగి ఉంది.
ఈ కారును కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారులు ఎలివేట్ ఎస్‌యువిని ఏదైనా కలర్ ఆప్షన్స్ తో ఇప్పటికే ఉన్న ఈ అపెక్స్ ఎడిషన్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
ఎక్స్‌టీరియర్ లో డీకాల్స్ లేదా స్టిక్కర్స్ వంటివి కాకుండా ఫెండర్‌పై 'అపెక్స్' ఎడిషన్ బ్యాడ్జ్ ని మాత్రమే కలిగి ఉంది. ఇది అపెక్స్ ఎడిషన్‌ను స్టాండర్డ్ ఎస్‌యువి నుండి వేరు చేయడంలో సహాయపడుతుంది.
ఇంటీరియర్ విషయానికొస్తే, ఎస్‌యువి ఇప్పుడు ఐవరీ మరియు బ్లాక్ కలర్స్ లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను పొందుతుంది. ఇది సాధారణమైన కలర్ లైట్ లెథెరెట్ ట్రిమ్‌తో జత చేయబడింది, ఇది లోపల భాగంలో విశాలమైన అనుభూతిని పెంచుతుంది.
బ్లాక్ -వైట్ మార్పులను మరింతగా ఆవిష్కరించే కొత్త యాంబియంట్ లైటింగ్ కలిగి ఉంది. ఇందులో, కలర్ ఎంచుకోవడానికి మరియు లోపల ఉన్న ప్రయాణీకుల ఉల్లాసమైన మూడ్ ని కలిగి ఉండేందుకు 'ఎలివేట్' 7 కలర్ ఆప్షన్స్ ను కూడా అందిస్తుంది.
అంతేకాకుండా, కార్‌మేకర్ అపెక్స్ ఎడిషన్ సిగ్నేచర్ ను సీట్ కవర్స్ మరియు కుషన్‌లతో ప్యాకెజీ తో అందిస్తుంది. అంతే కాకుండా, సీట్స్ వెనుక భాగంలో 'అపెక్స్' ఎడిషన్ బ్యాడ్జ్ కూడా చెక్కబడి (ముదించబడింది) ఉంటుంది.
పవర్‌ట్రెయిన్
హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ లో ఉన్న ఇంజిన్, 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ తో 118bhp మరియు 145Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి మోటార్తో జతచేయబడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప