- ఇండియాలో రూ.11 లక్షలు నుంచి మొదలుకానున్నధరలు
- ఇండియా అంతటా మరిన్ని మెగా డెలివెరీ ఈవెంట్లను హోస్ట్ చేయనున్న బ్రాండ్
హోండా కార్స్ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన మిడ్సైజ్ ఎస్‌యూవి, ఎలివేట్ డెలివరీలను ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్లో, ఆటోమేకర్ ఒక్క రోజులోనే ఎలివేట్ 100 యూనిట్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా, భారతదేశం అంతటా ఈ బ్రాండ్ మరిన్ని డెలివరీ హోస్ట్ ఈవెంట్లను ప్రారంభించనుంది.
ఎలివేట్ ఎస్‌యూవి నాలుగు రకాలైన SV, V, VX మరియు ZXలలో అందుబాటులో ఉంది, దీని ప్రారంభ ధర రూ. 11 లక్షలు. క్రెటా ప్రత్యర్థిగా ఉన్న ఎస్‌యూవి ఆరుస్పీడ్ మాన్యువల్ మరియు సివిటియూనిట్‌తో జత చేయబడిన 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ మోటార్ 119bhp మరియు 145Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
ఎలివేట్ టాప్ ZX వేరియంట్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఏడిఏఎస్సూట్ వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది.మేము భారతదేశంలోని టాప్ 10 నగరాల్లో హోండా ఎలివేట్ ఎస్‌యూవి ఆన్రోడ్ ధరల జాబితాను సిద్ధం చేసి ఉంచాము.
ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ డైరెక్టర్ యుయిచి మురాటా మాట్లాడుతూ, “ఈ ప్రత్యేకమైన మెగా డెలివరీ ఈవెంట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, మా ఎస్‌యూవి, హోండా ఎలివేట్‌ను ఆసక్తి కలిగి ఉన్న కస్టమర్‌లకు అందించడానికి మేము సంతోషిస్తున్నామని, అంతే కాకుండా ఈరోజు హైదరాబాద్‌లో 100 యూనిట్ల ఎలివేట్‌లను డెలివరీ చేశామని, దాని తర్వాత రాబోయే రోజుల్లో ఇతర నగరాల్లో మరిన్ని ఈవెంట్‌లు నిర్వహిస్తామని, హోండా ఎలివేట్ పట్ల కస్టమర్లకు ఉన్న ఉత్సాహం మరియు ప్రశంసలతో మేము మునిగిపోయామని ఇండియామార్కెట్లో హోండా ఎలివేట్ ఎంట్రీ దేశంలో మా బ్రాండ్ ఉనికిని తెలుపుతుందని, కొత్త విస్టాలను మేము నమ్ముతున్నాని, మా హోండా ఫ్యామిలీలోకి ఎలివేట్ కస్టమర్లందరినీ మేము స్వాగతిస్తున్నాము.' అని తెలిపారు.
అనువాదించిన వారు: రాజపుష్ప