- బేస్ వేరియంట్ “వి”తో ఎలిగెంట్ ఎడిషన్ ప్రారంభం
- అందుబాటులో ఉన్న మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్
హోండా ఇండియా, పండుగ సీజన్ ని 5-జెన్ సిటీ స్పెషల్ “ఎలిగెంట్ ఎడిషన్”తో ఘనంగా ప్రారంభించింది. సిటీ లిమిటెడ్ ఎడిషన్ V అనే బేస్ వేరియంట్ ని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ధరలు రూ.12.57 లక్షలు(ఎక్స్- షోరూం) మరియు రూ. 13.82 లక్షలు(ఎక్స్- షోరూం)గా ఉన్నాయి.
ఇందులో మార్పుల విషయానికొస్తే, హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్‌లో ఎల్ఈడీతో కూడిన టెయిల్‌గేట్ స్పాయిలర్, ఫ్రంట్ ఫెండర్ గార్నిష్, 'ఎలిగెంట్' బ్యాడ్జింగ్‌తో కూడిన ప్రత్యేకమైన సీట్ కవర్స్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, ఎలిగెంట్ ఎడిషన్ ఎంబ్లం మరియు వైర్లెస్ ఛార్జర్ వంటివి మార్పులతో వచ్చింది.
మెకానికల్ గా, హోండా సిటీలో 1.5 ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ఒక సివిటి యూనిట్ తో జత చేయబడి ఉంది. అదే విధంగా ఇందులో ఉన్న పెట్రోల్ మోటార్ 119bhp మరియు 145Nm మాక్సిమం టార్క్ ని ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడి ఉంది.
పండుగ ఎడిషన్ లో కొత్త వేరియంట్స్ పరిచయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ డైరెక్టర్ యుయిచి మురాటా మాట్లాడుతూ, “మేము పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్నందున, మా మోడళ్లను ప్రత్యేకమైన ప్రీమియం ప్యాకేజీతో మెరుగుపరచడంపైనే మేము మా దృష్టిని కేంద్రీకరించామని కొనుగోలుదారులకు తెలుపుతున్నాము. సిటీ మరియు అమేజ్ కొత్త ఎడిషన్స్ ను ఆకర్షణీయమైన ధరలలో, అద్బుతమైన ఫీచర్స్ తో మెరుగైన స్టైలింగ్ మరియు సౌకర్యాన్ని కొనుగోలుదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మన లైఫ్ లో పండుగలు జరుపుకోవడానికి ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, అవి ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. మేము మా కస్టమర్లందరికీ కొత్త కారు కొనుగోలును మరింత సులువుగా చేయడానికి, అదే విధంగా వారికి వీటిని ఒక బహుమతిగా అందింస్తున్నాము. ఈ పండుగ సీజన్ ను మరింత ఘనంగా ప్రారంభించడానికి కొత్త లిమిటెడ్ ఎడిషన్స్ ప్రారంభంతో పాటు సిటీ మరియు అమేజ్ కి సంబంధించిన ఇతర వేరియంట్లపై అద్భుతమైన ఆఫర్స్ మరియు ప్రమోషన్స్ కూడా తీసుకువచ్చాం” అని పేర్కొన్నారు.
కొత్త హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఎలిగెంట్ ఎడిషన్ ఎంటి | రూ. 12, 57,400 |
ఎలిగెంట్ ఎడిషన్ సివిటి | రూ. 13,82,400 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్