- అత్యధిక డిస్కౌంట్ ని అందుకున్న హోండా సిటీ హైబ్రిడ్
- 31 డిసెంబరు-2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఆఫర్స్
డిసెంబరు-2023లో తమ పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్నీ మోడల్స్ పై హోండా కార్స్ ఇండియా రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్, మరియు లాయల్టీ బోనస్ రూపంలో కొత్త కారును కొనుగోలు చేయాలనుకున్న వారికి అందించబడతాయి. ఇప్పుడు మనం వాటిని గురించి పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
డిసెంబరు-2023లో హోండా అమేజ్ పై ఉన్న డిస్కౌంట్స్ వివరాలు కింది విధంగా ఉన్నాయి:
డిస్కౌంట్ టైప్ | అమౌంట్ |
క్యాష్ డిస్కౌంట్ | రూ. 25,000 |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ. 15,000 |
కార్పొరేట్ డిస్కౌంట్స్ మరియు లాయల్టీ బోనస్ | రూ. 27,000 |
ఇప్పుడు, ఇంకా హోండా సిటీ విషయానికి వస్తే, సిటీ యొక్క పెట్రోల్ వేరియంట్స్ పై రూ. 90,000 వరకు డిస్కౌంట్స్ లభించనుండగా, అలాగే హైబ్రిడ్ వేరియంట్స్ పై రూ.1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్స్ లభించనున్నాయి.
డిస్కౌంట్ టైప్ | అమౌంట్ |
క్యాష్ డిస్కౌంట్ | రూ. 25,000 |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ. 15,000 |
కార్పొరేట్ డిస్కౌంట్స్ మరియు లాయల్టీ బోనస్ | రూ. 27,000 |
5-సంవత్సరాలవారంటీ ప్యాకేజ్ | రూ. 23,000 |
పైన పేర్కొన్న ఈ ఆఫర్స్ 31 డిసెంబరు-2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుండగా, కానీ, ఈ ఆఫర్లు మనం ఎంచుకునే ప్రాంతం, మోడల్, వేరియంట్, కలర్, డీలర్ షిప్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన కస్టమర్స్ మీకు దగ్గరలో ఉన్న అధికారిక హోండా డీలర్ షిప్ ని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్