- ఇండియాలో రూ. 6.73 లక్షలతో ప్రారంభంకానున్న సెలెరియో ధరలు
- అందుబాటులో ఉన్న 7 కలర్స్ మరియు 4 వేరియంట్స్
సెలెక్ట్ చేసిన మారుతీ సుజుకి కార్లు ఈ ఏడాది అక్టోబర్‌లో భారీ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ బెనిఫిట్స్, క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో నెక్సా మరియు ఎరీనా చైన్ లో ఉన్న డీలర్షిప్స్ వద్ద వర్తిస్తాయి.
మారుతి సుజుకి సెలెరియో VXi, ZXi మరియు ZXi పెట్రోల్ ఎంటి వేరియంట్స్ రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో అందించబడతాయి. ఏఎంటి వేరియంట్స్ పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, సిఎన్జి వేరియంట్స్ పై డిస్కౌంట్ రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ తో డిస్కౌంట్స్ పరిమితం చేయబడ్డాయి.
సెలెరియో LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. కస్టమర్లు 7 కలర్స్ నుండి ఎంచుకోవచ్చు. ఈ మోడల్ 1.0-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఏఎంటి యూనిట్‌తో జత చేయబడింది. పెట్రోల్ వెర్షన్ 66bhp మరియు 89Nm ఉత్పత్తి చేస్తుండగా, సిఎన్జి వెర్షన్ 56bhp మరియు 82Nm ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు:రాజపుష్ప