- మూడు వేరియంట్లలో అందించబడుతున్న సీల్ మోడల్
- 650 కిలోమీటర్ల వరకు క్లెయిమ్డ్ రేంజ్ ని అందించే అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ దీని సొంతం
ఈ సంవత్సరం మార్చి నెలలో బివైడి ఇండియా దేశవ్యాప్తంగా సీల్ సెడాన్ మోడల్ ని లాంచ్ చేసింది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ దాని సౌకర్యవంతమైన ధర, చూడచక్కని లుక్, బెస్ట్ ఫీచర్స్, సమర్థవంతమైన మరియు పవర్ ఫుల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో భారతీయుల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా, ఇది ఇండియన్ కస్టమర్లు మధ్య విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు, సీల్ మోడల్ ద్వారా ఈ చైనీస్ ఆటోమేకర్ 1,000 యూనిట్ల బుకింగ్స్ సాధించి ఒక కొత్త రికార్డును రిజిస్టర్ చేసింది.
బివైడి సీల్ మోడల్ ని కస్టమర్లు డైనమిక్, ప్రీమియం, మరియు పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో పొందవచ్చు. అలాగే ఇది ఆర్కిటిక్ బ్లూ, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్, మరియు అరోరా వైట్ అనే నాలుగు ఎక్స్‌టీరియర్ కలర్లలో అందుబాటులో ఉంది. ఇంకా ఫీచర్ల పరంగా చూస్తే, టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ రొటేటబుల్ 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ ఫ్రంట్-రో సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు లెవెల్-2 ఎడాస్ఏడీఏఎస్సూట్ వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఏ ఎలక్ట్రిక్ కారులో లేని బెస్ట్ ఫీచర్లను సీల్ మోడల్ లో బివైడి కంపెనీ అందించింది.
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, బివైడి సీల్ మోడల్ ని కస్టమర్లు 61.44kWh యూనిట్ మరియు 82.56kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ సీల్ మోడల్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడిన సుమారు 650కిలోమీటర్ల రేంజ్ వరకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించవచ్చు.
వెర్షన్ | బ్యాటరీ ప్యాక్ | కాన్ఫిగరేషన్ | రేంజ్ | యాక్సలరేషన్ సమయం (0-100కెఎంపిహెచ్) |
డైనమిక్ | 61.44kWh | ఆర్‌డబ్లూడీ | 510కి.మీ. | 7.5 సెకన్లు |
ప్రీమియం | 82.56kWh | ఆర్‌డబ్లూడీ | 650కి.మీ. | 5.9 సెకన్లు |
పెర్ఫార్మెన్స్ | 82.56kWh | ఏడబ్లూడీ | 580కి.మీ. | 3.8 సెకన్లు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్