- మూడు వేరియంట్లలో లభ్యం
- 650 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న సీల్
ఈ వారం ప్రారంభంలో, చైనీస్ ఆటోమేకర్ ఇండియాలో బివైడి ఇండియా కంపెనీ దాని మూడవ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ అయిన సీల్ కారును లాంచ్ చేసింది. ఈ మిడ్-సైజ్ సెడాన్ మోడల్ ని మొత్తంగా డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో రూ.41 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇప్పుడు, లాంచ్ తర్వాత ఈ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ముందుగా ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు సీల్ లాంటి కారు ఏ ఒక్కటీ లేదు అంటే నమ్మగలరా ! నమ్మశక్యం కాదు. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, లాంగ్ బానెట్, యారో-షేప్డ్ వేవ్ ప్యాటర్న్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫ్రంట్ ఫెండర్స్ పై యారో- షేప్డ్ ఇన్సర్ట్స్, గ్లాస్ రూఫ్ తో స్లోపింగ్ రూఫ్ లైన్, 19-ఇంచ్ వరకు ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్, మరియు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి బెస్ట్ కలెక్షన్స్ ని పొందింది.
ఫీచర్ల పరంగా, బివైడి సీల్ 15.6-ఇంచ్ రొటేటబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెచ్‍యుడి డిస్‌ప్లే, ట్విన్ వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 12-స్పీకర్ సెటప్, మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) సూట్ వంటి ఫీచర్లతో వచ్చింది.
బివైడి సీల్ కారు 61.44kWh మరియు 82.56kWh యూనిట్ అనే బ్యాటరీ ప్యాక్స్ తో వచ్చింది. బివైడి సీల్ కారును ఎంచుకున్న వేరియంట్ అధారంగా ఒకే ఒక్క సింగిల్ ఛార్జ్ తో, ఈ సెడాన్ 510 కిలోమీటర్లు, 580 కిలోమీటర్లు, మరియు 650 కిలోమీటర్లు క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
ఇతర వార్తలలో చూస్తే, చైనీస్ ఈవీ మేకర్ లేటెస్ట్ బివైడి సీల్ సెడాన్ ద్వారా ఇండియాలో 200కి పైగా బుకింగ్స్ అందుకున్నట్లు ప్రకటించింది. అదే విధంగా, రానున్న మరికొన్ని వారాల్లో వీటి డెలివరీ ప్రారంభంకానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్