- మూడు వేరియంట్లలో లభ్యం
- టాప్-స్పెక్ వేరియంట్ పై లభిస్తున్న అత్యధిక డిస్కౌంట్స్
బివైడి ఇండియా లేటెస్టుగా దాని కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఎంపివి మోడల్ eMax 7 ధరలను ప్రకటించింది. ఇప్పుడు, ఆటోమేకర్ దీపావళి పండుగ సందర్భంగా మరింత గుడ్ న్యూస్ తో మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం, ఆల్-ఎలక్ట్రిక్ సీల్ సెడాన్ కారు రూ.2.5 లక్షల భారీ డిస్కౌంట్ తో అందించబడుతుంది.
కొన్ని నెలల క్రితం బివైడి సీల్ మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ కారు మూడు వేరియంట్లలో లభిస్తుండగా, అందులో డైనమిక్, ప్రీమియం, మరియు పెర్ఫార్మెన్స్ వంటివి ఉన్నాయి. ఇంకా ధర విషయానికి వస్తే, ఈ మోడల్ రేంజ్ ఎక్స్-షోరూం ధరలు రూ.41 లక్షల నుంచి రూ.53 లక్షల మధ్య ఉన్నాయి.
డిస్కౌంట్ల పరంగా చూస్తే, కస్టమర్లు ఎవరైతే సీల్ కారు టాప్-స్పెక్ వెర్షన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి రూ.2.5 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.2 లక్షల క్యాష్ డిస్కౌంట్లతో పాటుగా మూడేళ్ళ వరకు రూ.50 వేలు విలువ చేసే మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా లభిస్తుంది. అదే విధంగా, సీల్ ప్రీమియం వేరియంట్ కారు రూ.1 లక్ష విలువ చేసే బెనిఫిట్స్ తో అందుబాటులో ఉంది.