- మూడు వేరియంట్లలో లభ్యం
- రూ.41 లక్షలతో మోడల్ ధరలు ప్రారంభం
ఇండియాలో తాజాగా బివైడి ఇండియా కంపెనీ దాని మూడవ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ అయిన సీల్ కారును లాంచ్ చేసింది. ఈ మోడల్ ని మొత్తంగా డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో రూ.41 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, ఈ చైనీస్ ఆటోమేకర్ సీల్ మోడల్ ద్వారా కేవలం రెండు రోజుల్లోనే 200కి పైగా బుకింగ్స్ అందుకున్నట్లు ప్రకటించింది.
బివైడి సీల్ ఫీచర్స్
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, బివైడి సీల్ యొక్క టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 15.6-ఇంచ్ రొటేటబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెచ్‍యుడి డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 12 స్పీకర్లు, ఆటోమేటిక్ ఐఆర్‌విఎం, మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) సూట్ వంటి ఫీచర్లను పొందింది.
బ్యాటరీ ప్యాక్ & డ్రైవింగ్ రేంజ్
బివైడి సీల్ కారును 61.44kWh మరియు 82.56kWh యూనిట్ అనే బ్యాటరీ ప్యాక్స్ తో పొందవచ్చు. బివైడి సీల్ కారును ఒకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంచుకున్న వేరియంట్ మరియు డ్రివెట్రిన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా 510 కిలోమీటర్లు, 580 కిలోమీటర్లు, మరియు 650 కిలోమీటర్లు క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్