- రూ. 41 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న సీల్ మోడల్
- 650 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ దీని సొంతం
బివైడి ఇండియా ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 200 యూనిట్ల సీల్ సెడాన్ కార్లను డెలివరీ చేసి అద్బుతమైన కొత్త రికార్డును చేసింది. తాజాగా, ఈ చైనీస్ ఆటోమేకర్ నుంచి వచ్చిన ఈ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ బుకింగ్ ప్రారంభించిన రెండు నెలల్లోనే 1,000 పైగా ఆర్డర్లను అందుకుంది. ఢిల్లీ ఎన్ సి ఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మరియు కొచ్చి మరియు ఇతర నగరాల్లో మెగా డెలివరీ ఈవెంట్ ద్వారా 200 సీల్ కార్లను ఒకేరోజు డెలివరీ కార్ మేకర్ డెలివరీ చేసింది.
బివైడి సీల్ మోడల్ ఇండియాలో 5 మార్చి, 2024లో రూ. 41 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. సీల్ కారును డైనమిక్, ప్రీమియం, మరియు పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో పొందవచ్చు. స్పెసిఫికేషన్స్ పరంగా, సీల్ ఎలక్ట్రిక్ కారును 61.44kWh యూనిట్ మరియు 82.56kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్లతో పొందవచ్చు. అదనంగా, ఈ సెడాన్ కేవలం ఒక్క సింగిల్ చార్జ్ తో ఏఆర్ఏఐ ద్వారా సర్టిఫై చేయబడిన 650 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
ఈ ఈవెంట్‌పై బివైడి ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, 'ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ఇండియాలో బివైడి సీల్ కి ఉన్న ఆదరణ, పెర్ఫార్మెన్స్, స్థిరత్వం కొనసాగుతుంది. బివైడి సీల్ మోడల్ ఇండియాలో క్లీన్ మరియు గ్రీన్ థీమ్ ద్వారా చేయడానికి మా నిబద్ధతను చాటుతూ మమ్మల్ని మరొక మెట్టు ఎక్కిస్తుందని మేము నమ్ముతున్నాము.' అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్