- సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందించబడుతున్న కొత్త కారు
- 635 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించే బ్యాటరీతో వచ్చిన లగ్జరీ మోడల్
బిఎండబ్లూ ఇండియా సరికొత్త iX ఎక్స్‌డ్రైవ్50 అనే అత్యంత సౌకర్యవంతమైన లగ్జరీ కారును రూ.1,39,50,000 (ఎక్స్-షోరూం) ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఏకైక సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందుబాటులోకి రాగా, ఇది సిబియు రూట్లో ఇండియాలో ప్రవేశించింది.
ఇంటీరియర్ పరంగా, ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లోపల ఫ్రీస్టాండింగ్ 14.9-ఇంచ్ కర్వ్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, 18-స్పీకర్ హార్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు సరౌండ్-వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
బిఎండబ్లూ iX ఎక్స్‌డ్రైవ్50 కారు 111.5kWh బ్యాటరీ ప్యాక్ డ్యూయల్-మోటార్ సెటప్ కి సహాయపడుతూ516bhp మరియు 765Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 635 కిలోమీటర్ల డబ్లూఎల్ టిపి-క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తుంది. ఒకవేళ ఈ కారు బ్యాటరీ పూర్తిగా అయిపోతే, దీనిని 195kW వరకు సపోర్ట్ చేసే డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఛార్జ్ చేయవచ్చు. దీని ద్వారా కేవలం 35 నిమిషాల్లోనే 10-80 వరకు ఛార్జ్ చేయవచ్చు.
మేము ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని డ్రైవ్ చేశాము. దీనికి సంబంధించిన రివ్యూని చదవగలరు.
బిఎండబ్లూ iX ఎక్స్‌డ్రైవ్50 క్లెయిమ్డ్ ఛార్జింగ్ కి సంబంధించి వివిధ సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఛార్జర్ టైప్ | ఛార్జింగ్ శాతం | పట్టే సమయం |
195kW డిసి | 10-80 శాతం | 35 నిమిషాలు |
50kW డిసి | 10-80 శాతం | 97 నిమిషాలు |
22kW ఎసి | 0-100 శాతం | 5.5 గంటలు |
11kW ఎసి | 0-100 శాతం | 11 గంటలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్