- ఇండియాలో రూ.9.98 లక్షలతో ప్రారంభమైన ధరలు
- వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ దీని సొంతం
కొన్ని రోజుల క్రితం, ఎంజి మోటార్ ఇండియా ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ 2024 ఇటరేషన్ ఆస్టర్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఇది స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, మరియు సావీ ప్రో అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడుతున్న ఆస్టర్ ధరలు రూ.9.98 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఆర్టికల్ లో మేము ఇండియాలోని టాప్-10 సిటీల్లో 2024 ఎంజి ఆస్టర్యొక్క బేస్ వేరియంట్ మరియు టాప్ వేరియంట్ ఆన్-రోడ్ ధరలను పొందుపరిచాము.
సిటీ | బేస్ వేరియంట్ | టాప్ వేరియంట్ |
హైదరాబాద్ | రూ. 11.98 లక్షలు | రూ. 22.06 లక్షలు |
ఢిల్లీ | రూ. 11.33 లక్షలు | రూ. 20.85 లక్షలు |
చెన్నై | రూ. 11.90 లక్షలు | రూ. 22.25 లక్షలు |
కోల్ కతా | రూ. 11.59 లక్షలు | రూ. 20.81 లక్షలు |
బెంగళూరు | రూ. 11.99 లక్షలు | రూ. 22.07 లక్షలు |
ముంబై | రూ. 11.71 లక్షలు | రూ. 21.21 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 10.99 లక్షలు | రూ. 19.73 లక్షలు |
పూణే | రూ. 11.71 లక్షలు | రూ. 21.21 లక్షలు |
చండీఘర్ | రూ. 10.98 లక్షలు | రూ. 19.71 లక్షలు |
కొచ్చి | రూ. 11.87 లక్షలు | రూ. 22.04 లక్షలు |
2024 ఎంజి ఆస్టర్ ఇప్పుడు మరెన్నో కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది, అందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కోసం వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు అప్‌డేటెడ్ ఐస్మార్ట్యూజర్ ఇంటర్‌ఫేస్ ఉన్నాయి.
హుడ్ క్రింద, ఎంజి మోటార్ కంపెనీ 2024 ఆస్టర్ యొక్క పవర్ ట్రెయిన్లలో ఏ మాత్రం మార్పులు చేయలేదు. ఇంతకు ముందు ఉన్న 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్లనే ఇందులో కూడా కొనసాగిస్తుంది. మొదటిది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో మాత్రమే జతచేయబడి 138bhp పవర్ మరియు 144Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి గేర్ బాక్సుతో జత చేయబడి 108bhp మరియు144Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్