- అతిపెద్ద 84kWh బ్యాటరీ ప్యాక్ ని పొందిన కియా ఎలక్ట్రిక్ మోడల్
- ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ లో సరికొత్త మార్పులను పొందిన EV6 ఫేస్‌లిఫ్ట్
కియా తన ఆల్-ఎలక్ట్రిక్ EV6 క్రాస్‌ఓవర్ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను గ్లోబల్ మార్కెట్‌లలో ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ విభాగంలో కొన్ని ముఖ్యమైన మెరుగుదలతో పాటు కొన్ని ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ సరికొత్త మార్పులను కూడా పొందింది.
బయటి వైపు, న్యూ EV6 ఫేస్‌లిఫ్ట్ బంపర్ మరియు స్లీకర్ ఒకే విధంగా ఉండే మార్పులను పొందుతుంది. అతి ప్రాముఖ్యమైన మార్పు ఏమిటంటే, ట్రయాంగిల్ -షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో సరికొత్తగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. మరో వైపు, ఇందులో అతిపెద్ద ప్రాముఖ్యమైన మార్పు ఏంటి అంటే, ఇది న్యూ ప్యాటర్న్డ్ తో కూడిన అల్లాయ్ వీల్స్ తో రాగా, దీనిని 19-ఇంచ్ మరియు 20-ఇంచ్ కాన్ఫిగరేషన్‌లలో ఎంచుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే, EV6 క్యాబిన్ ఇప్పుడు డిజిటల్ ఐఆర్‍విఎం, 12-ఇంచ్ హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు ఆఫ్-సెట్ కియా లోగోతో రీడిజైన్ చేయబడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో అమర్చబడిన వీటిని మనం మరిన్ని రాబోయే(అప్ కమింగ్) కియా EVలలో చూస్తాము.
బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, కియా EV6 పెద్ద 84kWh యూనిట్‌ను పొందుతుంది, ఇది ఇంతకు ముందున్నఇటరేషన్ కంటే 6.6kWh యూనిట్ వరకు పెరిగింది. అలాగే మరోవైపు, ఈ బ్యాటరీ ప్యాక్ 350kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది, ఇది బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు చేయడానికి అనుమతిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప