మీరు ఏమనుకుంటున్నారు?
రాబోయే ఎన్యాక్ పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.
ధర
స్కోడా ఎన్యాక్ ధరలు Rs. 50.00 లక్షలు - Rs. 55.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
లాంచ్ తేదీ:
జనవరి 2023లో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో స్కోడా ఇనియాక్ లాంచ్ అయింది.
వేరియంట్స్:
ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ అంతర్జాతీయ మార్కెట్‌లో 5 వేరియంట్స్ అందుబాటులో ఉంది. అవి 50, 60, 80, 80X, మరియు vRS.
పెర్ఫార్మెన్స్:
స్కోడా ఇనియాక్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ డెవలప్ చేసిన ఎంఈబీ మాడ్యులర్ ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై తయారయింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది: 52kWh, 58kWh మరియు 77kWh. చిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ రియర్-వీల్ డ్రైవ్ డ్రైవ్‌ట్రెయిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి, అయితే పెద్ద 77kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఆర్డబ్ల్యూడీ మరియు ఏడబ్ల్యూడీ రెండింటితో వస్తుంది. WLTP సైకిల్ ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారుగా 500 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.
ఫీచర్స్:
స్కోడా ఇనియాక్ లో 13-ఇంచ్ ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ డ్రైవర్ సీటు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
పోటీ:
ఇది కియా EV6, హ్యుందాయ్ అయోనిక్ 5, వోల్వో XC40 రీఛార్జ్ మరియు బీఎండబ్ల్యూ i4 లకు పోటీగా ఉంది.
చివరిగా అప్ డేట్ చేసిన తేదీ: 10-11-2023