- 2025 చివరలో వచ్చే అవకాశం
- క్రెటా ఫార్ములాను ఫాలో అవుతున్న అల్కాజార్ ఈవీ
క్రెటా ఈవీ గురించి వార్తలు ఎలా చక్కర్లు కొడుతున్నాయో ఇప్పుడు అల్కాజార్ ఈవీకి సంబంధించిన న్యూస్ కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. కార్ వాలే ద్వారా మాకు తెలిసింది ఏంటి అంటే, ఈ కారు కూడా 2025 సంవత్సరం చివరి వరకు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి అంశాలు ఈ కారుని బెస్ట్ కారుగా మార్కెట్లో నిలుపుతాయో, హ్యుందాయ్ ఫ్యామిలీలో ఈ కారు ఎందుకు ఉందో దానికి సంబంధించిన టాప్-4 కారణాలను మీకు అందిస్తున్నాము.
లాజికల్ ప్రోగ్రెస్
హ్యుందాయ్ క్రెటా ఈవీ కారు ఈ ఆర్ధిక సంవత్సరం చివరికల్లా ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతుందనే వార్తలు కోడై కూస్తున్నాయి. దీని ద్వారా హ్యుందాయ్ నుంచి లోకల్ గా తయారుచేయబడిన ఎలక్ట్రిక్ కారుగా వస్తుంది. కేవలం 450-500 కిలోమీటర్లని అందించడమే కాకుండా చాలా ఫీచర్లతో వస్తుంది. అలాగే ఈ కారు మాడిఫైడ్ K2 ప్లాట్ ఫారం ఆధారంగా వస్తుండగా, ఇదే ప్లాట్ ఫారంని ఉపయోగించుకుని సెల్టోస్ మరియు కారెన్స్ కార్లు వస్తున్నాయి. అంతెందుకు ! అల్కాజార్ కూడా వస్తుంది. ఎలక్ట్రిక్ కారెన్స్ వస్తుందని వాస్తవం ద్వారా మనకు ఎలక్ట్రిక్ అల్కాజర్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది.
రెండు/మూడు విధాల పద్ధతి
లాజికల్ ప్రోగ్రెస్ కి అదనంగా, ఇది కూడా సెగ్మెంట్ కి దగ్గరగా హ్యుందాయ్ రెండు/మూడు విధాల పద్దతితో జతకట్టనుంది. ఒకవేళ మీరు ఆటోమేకర్ లైన్ ని పరిశీలిస్తే, ప్రతి సెగ్మెంట్ లో వివిధ మోడల్స్ ని కలిగి ఉంది. అలాగే ఆయా సెగ్మెంట్లలో వాటి షేర్ ని విక్రయిస్తుంది. నియోస్, ఎక్స్ టర్, ఆరా వంటి కార్లు సబ్-10 లక్షల సెగ్మెంట్లో ఉండగా, వెన్యూ మరియు i20 కార్లు సబ్-4 మీటర్ సెగ్మెంట్లో ఉన్నాయి. అలాగే వెర్నా, క్రెటా మరియు అల్కాజార్ వంటి కార్లు డి-సెగ్మెంట్లో ఉన్నాయి. చూడండి మీరే, వీటి ద్వారా మనం ఎక్కడికి వెళ్లబోతున్నామో? హ్యుందాయ్ కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలు మరియు మూడు-వరుసల ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ మార్కెట్ ద్వారా మంచి ప్రొడక్టులను అందించేందుకు కృషి చేస్తుంది.
కొత్త కార్ల యుద్ధం
కొత్త కార్ల యుద్ధంలో మొదటి రౌండును డి-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీల ద్వారా ప్రారంభిద్దాం. అందులో టాటా కర్వ్ ఈవీ, మారుతి eVX, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ ఈవీ, ఎంజి ZS ఈవీ మరియు మహీంద్రా BE.05 వంటి కార్లు ఈ సెగ్మెంట్లో పోటీగా ఉన్నాయి. వీటితో మహీంద్రా XUV.e8, కియా కారెన్స్ ఈవీ మరియు హ్యుందాయ్ అల్కాజార్ ఈవీ వంటి కార్లు జతచేరనుండగా, ఈ కార్లన్నీ మూడు వరుసలతో అందించాబడనున్నాయి.
ఎగుమతి సామర్థ్యం
ఇండియా నుంచి గల్ఫ్ ఆటో మార్కెట్లకు అలాగే, ఆఫ్రికా మరియు సౌత్ ఈస్ట్ మార్కెట్లకు అలాగే ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి ఎగుమతి అవుతున్న పాపులర్ మోడల్స్ లో అల్కాజార్ ఒకటిగా నిలిచింది. ఈ మోడల్ ని ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా అందించడంతో దీని మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్