- ఆటో ఎక్స్‌పో-2023లో ప్రదర్శన
- పవర్డ్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకం
కొత్త కార్ లాంచ్ మరియు సేల్స్ పరంగా టాటా మోటార్స్ కి ఇది బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బ్రాండ్ కి సంబంధించిన వివిధ ప్రొడక్ట్స్ ని ప్రదర్శించింది. అప్పటి నుంచి, ఈ ఆటోమేకర్ నెక్సాన్ (ఐసీఈ మరియు ఈవీ), హారియర్ ఫేస్‍లిఫ్ట్, సఫారి ఫేస్‍లిఫ్ట్, పంచ్ సిఎన్‍జి, అల్ట్రోజ్ సిఎన్‍జి, మరియు అప్ డేటెడ్ టియాగో మరియు టిగోర్ సిఎన్‍జి లాంటి వివిధ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. కానీ, ఇందులో టాటా అల్ట్రోజ్ రేసర్ ఎక్కడ ఉంది ?
జనవరిలో ప్రొడక్షన్-రెడీ రూపంలో అల్ట్రోజ్ రేసర్ ను ప్రదర్శించగా, ఎక్స్‌పో తర్వాత, ఈ బ్రాండ్ పెర్ఫార్మెన్స్ హ్యచ్ బ్యాక్ లాంచ్ కి సంబంధించి ఎటువంటి టైంలైన్ ను వెల్లడించలేదు. ఎలా అయితే ఏంటి, కామోఫ్లేజ్ టెస్ట్ మ్యూల్ తో చుట్టబడి ఉన్న అల్ట్రోజ్ రేసర్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మార్పుల పరంగా చూస్తే, స్టాండర్డ్ అల్ట్రోజ్ తో పోలిస్తే అల్ట్రోజ్ రేసర్ లో ఖచ్చితంగా కాస్మోటిక్ మరియు మెకానికల్ అప్ గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇందులో బ్లాక్డ్-అవుట్ రూఫ్ మరియు బానెట్, గ్లోస్ బ్లాక్ ఫినిష్ తో అల్లాయ్ వీల్స్ మరియు ఓఆర్ విఎం, మరియు ఫ్రంట్ ఫెండర్ పై రేసర్ బ్యాడ్జి పెద్ద హైలైట్ గా చెప్పవచ్చు. అలాగే ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఎక్స్ పోలో ప్రదర్శించిన మోడల్ ని బట్టి చూస్తే, ఇది 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ కమాండింగ్ తో పనిచేసే సన్ రూఫ్, వైర్ లెస్ చార్జర్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు రెడ్ స్టిచింగ్ తో రివైజ్డ్ సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇందులోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, దీని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడి ఉంటుంది. దీని ఇంజిన్ అచ్చం నెక్సాన్ ను పోలి ఉండి, 120bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్