- ప్రస్తుతం 14సిఎన్‍జి- ఎనేబుల్డ్ మోడళ్లను అందిస్తున్న మారుతి
- కొత్త Z-సిరీస్ ఇంజన్ - సిఎన్‍జి కాంబినేషన్ తో అరంగేట్రం చేయనున్న డిజైర్
ప్రైవేట్ మార్కెట్ కొనుగోలుదారుల పరంగా చూస్తే, మారుతి వ్యాగన్ ఆర్ జపాన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన పాపులర్ సిఎన్‍జి వెహికిల్. ఆశ్చర్యకరమైన అంశం ఏంటి అంటే, మారుతి మొత్తం సిఎన్‍జి సేల్స్ లో 46 శాతం వాటాను కలిగి ఉండి మొదటి స్థానంలో నిలవగా, బ్రెజా ఎస్‍యూవీ 26 శాతం వాటాతో రెండవ స్థానంలో నిలిచింది. ఇంకా మిగిలిన 28 శాతం వాటాను ఆల్టో నుండి గ్రాండ్ విటారా వరకు ఉన్న ఇతర 12 సిఎన్‍జి-ఎనేబుల్డ్ మోడల్స్ పంచుకున్నాయి.
దీనిని మరింత ఆసక్తికరంగా మారుస్తూఎర్టిగా టూర్ ద్వారా సిఎన్‍జి కార్లు అత్యధిక షేర్ ని అందించగా, మొత్తంగా ఖచ్చితంగా చెప్పాలంటే 56 శాతం దోహదపడుతున్నాయి, అయితే ఇది ఫ్లీట్ మార్కెట్-ఓన్లీ వెహికల్ కాబట్టి విడిగా పరిగణించబడుతుంది. నిజానికి, ఎర్టిగాకు అదనపు డిమాండ్‌ను కల్పించేందుకు మారుతి ఇటీవల మనేసర్‌లో దాని ప్రొడక్షన్ కెపాసిటీని విస్తరించింది. ఇప్పుడు కొత్త ప్రొడక్ట్ రేంజ్ ద్వారా సంవత్సరానికి లక్ష యూనిట్లకు పైగా ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మారుతి కంపెనీ కలిగి ఉంది.
మొత్తం స్కీమ్ లో భాగంగా,మారుతి గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 4.8 లక్షల యూనిట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధితో 6 లక్షల సిఎన్‍జి-బేస్డ్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ద్వారా బ్రెజా మరియు గ్రాండ్ విటారా మోడల్స్ సిఎన్‍జి పవర్ తో వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇతర వార్తలలో చూస్తే, ఈ త్రైమాసికం చివరి నాటికి రాబోయే (అప్ కమింగ్) డిజైర్ లో అందించబడే కొత్త Z-సిరీస్ ఇంజన్ సిఎన్‍జి పవర్ ని పొందుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్