- EX30తో పాటుగా లాంచ్ అయ్యే ఛాన్స్
- లోకల్ గా ఇండియాలోనే అసెంబుల్ చేయనున్న వోల్వో
వోల్వో ఇండియా దేశవ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ స్వీడిష్ ఆటోమేకర్ దాని ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీ, EX90ని 2025లో ఇండియాకు తీసుకువస్తున్నట్లు నిర్ధారించింది. ఇది దాని ఎంట్రీ-లెవెల్ ఇటరేషన్ EX30తో పాటుగా అమ్మకానికి రానుంది.
ప్రస్తుతానికి, ఈ కార్ మేకర్ XC40రీచార్జ్మరియు C40రీచార్జ్ అనే రెండు ఎలక్ట్రిక్ మోడల్స్ ని విక్రయిస్తుంది. రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‍యూవీల గురించి చెప్పాలంటే, 7-సీటర్ EX90 ప్రపంచవ్యాప్తంగా 2022లో దాని అరంగేట్రం చేసింది. EX90 యొక్క టాప్-ఆఫ్-ది-రేంజ్ వేరియంట్ 111kWh బ్యాటరీ ప్యాక్ కేవలం ఒకే ఒక్క సింగిల్ ఛార్జ్ తో 600 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. బ్యాటరీ ప్యాక్ ప్రతి యాక్సిల్ పై ఉన్న రెండు ఎలక్ట్రిక్ మోటార్లకు పవర్ ని సప్లై చేస్తూ 500bhp మరియు 900Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది.
మరోవైపు, ఎంట్రీ-లెవెల్EX30 ఎలక్ట్రిక్ మోడల్ రెండు మోటార్ల సెటప్ 69kWh బ్యాటరీ ప్యాక్ తో రానుంది. ఇక EX30 ఒకే ఒక్క ఫుల్ ఛార్జ్ తో 474 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీ రేంజ్ ని అందిచనుంది.
ఇతర వార్తలలో చూస్తే, ఈ స్వీడిష్ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఈవీ లైనప్ లో ఉన్న వాటి పేర్లను మార్చింది. XC40రీచార్జ్మరియు C40రీచార్జ్ అనే రెండు ఎలక్ట్రిక్ కార్ల పేరును మార్చి, వరుసగా EX40 మరియు EC40గా పిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ రెండు మోడల్స్ యొక్క పవర్ అవుట్ పుట్ 436bhp వరకు పెరిగింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్