- 2017 నుండి ప్లాంట్ లో ముమ్మరంగా కొనసాగుతున్న వోల్వో కార్ల అసెంబుల్ ఆపరేషన్స్
- 10,000వ యూనిట్ గా వచ్చిన XC40 రీచార్జ్ మోడల్
దేశవ్యాప్తంగా 10,000 కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త మైల్‍స్టోన్‍ని సాధించినట్లు వోల్వో కార్ ఇండియా ప్రకటించింది. బెంగళూరుకు దగ్గరలో ఉన్న హోస్కోట్ మానుఫాక్చరింగ్ సెంటర్ నుండి 10,000వ యూనిట్ గా ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ వోల్వో XC40 రీచార్జ్ వచ్చింది.
వోల్వో కంపెనీ 2017 నుండి ఇక్కడ అసెంబ్లీ ఆపరేషన్ ప్రారంభించగా, ప్రొడక్షన్ లైన్ ద్వారా మొట్టమొదటిగా వోల్వో XC90 మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ప్లాంట్ లో 5 మోడల్స్ అనగా XC90, XC60, S90, XC40 రీచార్జ్ మరియు తాజాగా C40రీచార్జ్ వంటి కార్లు అసెంబుల్ చేయబడి లాంచ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే, అత్యధికంగా 4 వేలకు పైగా XC60 మోడల్ కార్లు ఉత్పత్తి చేయబడి సేల్స్ చార్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నట్లు కార్ మేకర్ పేర్కొంది.
ఈ సందర్భంగా వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ, “దాదాపు మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ తక్కువ సమయంలో కంపెనీ ఈ మైలురాయిని చేరుకోవడం నిజంగా మేము గర్వకారణంగా భావిస్తున్నాము. బెంగళూరులో నెమ్మదిగా స్థిరమైన పెరుగుదలను గమనిస్తే ఇండియాలోని లగ్జరీ మొబిలిటీ విభాగంలో మా నిబద్ధతను సూచిస్తుంది. 10,000వ కారు ప్రొడక్షన్ గౌరవం మా ప్యూర్ ఎలక్ట్రిక్ మోడల్ XC40 రీఛార్జ్‌కు దక్కుతుంది, ఇది కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది.” అని పేర్కొన్నారు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్