- టైగున్ ఓనం ఎడిషన్‌తో పాటుగా లాంచ్ అయిన వర్టూస్ స్పెషల్ ఎడిషన్
- 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌తో మాత్రమే అందించబడిన మోడల్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దాని MQB మోడల్స్ టైగున్ మరియు వర్టూస్ లలో స్పెషల్ ఓనం ఎడిషన్ వేరియంట్‌లను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. వీటిలో, వర్టూస్ లో ఈ కొత్త వెర్షన్ రూ. 13.57 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ న్యూ(కొత్త) స్పెషల్ ఎడిషన్ జిటి లైన్ ఆధారంగా రూపొందించబడగా, దీనిని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌తో పొందవచ్చు. తర్వాత వచ్చిన వర్టూస్ స్పెషల్ ఎడిషన్ రూ. 14.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉంది.
మార్పుల విషయానికొస్తే, కొత్త ఓనమ్ ఎడిషన్ స్టాండర్డ్ జిటి లైన్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఇందులో అదనంగా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, పడిల్ ల్యాంప్స్, డ్యూయల్ హార్న్‌లు మరియు ఫెండర్‌లపై టిఎస్ఐ బ్యాడ్జ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి .
అదేవిధంగా , వర్టూస్ ఓనమ్ ఎడిషన్ 1.0-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 114bhp మరియు 178Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
వేరియంట్ వారీగా ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ ఓనమ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ధర (ఎక్స్-షోరూం) |
వర్టూస్ ఓనం ఎడిషన్ ఎంటీ | రూ. 13.57లక్షలు |
వర్టూస్ ఓనం ఎడిషన్ఏటీ | రూ. 14.82 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప