- ప్రతినెలా కస్టమర్లను ఆకర్షించేలా ఆఫర్ల వెల్లువ
- పాపులర్ హ్యుందాయ్ వెర్నా, ఇతర కార్ల కంటే ఎక్కువగా నమోదవుతున్న సేల్స్
ఇండియాలో అన్ని రకాల ఎస్‍యూవీలకు పాపులారిటీ పెరుగుతున్న కారణంగా సెడాన్ సెగ్మెంట్లో, ప్రత్యేకించి మిడ్-సైజ్ గ్రూపులో సాధారణంగా కస్టమర్లు కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే, కొన్ని బ్రాండ్లు మూడు-వరుసల సెడాన్లను తీసుకువస్తూ ఈ సెగ్మెంట్ కి ఊపిరి పోస్తున్నాయి. అందులో హ్యుందాయ్, హోండా, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా, మరియు మారుతి సుజుకి కూడా ఉంది.
పైన పేర్కొన్న బ్రాండ్లను పరిశీలిస్తే, ఎవరైతే సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి హ్యుందాయ్ బ్రాండ్ టాప్ ఛాయిస్ ఆప్షన్ గా మారింది. కొరియన్ కార్ మేకర్ నుంచి వచ్చిన వెర్నా కారు లాంచ్ అయినప్పటి నుంచి దాని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అయితే, గత కొన్ని నెలల నుంచి ఇది మారిపోయింది. ఇండియాలో మే-2024 నుంచి సెడాన్ల సేల్స్ చార్టులో ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ టాప్ సెల్లింగ్ మోడల్ గా కొనసాగుతుంది.
మే నుంచి జూలైలో 4,932 యూనిట్ల ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ కార్లు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో హ్యుందాయ్ 4,225 యూనిట్ల వెర్నా కార్లను విక్రయించింది. అంటే దీని కంటే ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ కార్లు 15 శాతం ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ సేల్స్ పెరగడానికి కారణం ఏమిటంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి సెడాన్ పై అందించిన భారీ డిస్కౌంట్స్ కారణమని చెప్పవచ్చు. అలాగే, కస్టమర్లకు చేరువయ్యేలా, మరింత వారిని ఆకర్షించేలా సెడాన్ లో వివిధ రకాల కొత్త వేరియంట్లు, స్పెషల్ ఎడిషన్లు మరియు ఫీచర్ అప్‌డేట్లు అందించబడ్డాయి.
ప్రస్తుతం, ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ కారు రూ. 11.56 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అదే విధంగా, వర్టూస్ టాప్-స్పెక్ వెర్షన్ రూ.19.41 లక్షల ధరతో విక్రయించబడుతుంది. ఇంకా, ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, లాంచ్ అయినప్పటి నుంచి, వర్టూస్ కారు పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, మరియు మెరుగైన ఆడియో సిస్టం వంటి ఫీచర్లతో వస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్