- రూ.14.07 లక్షలతో ధరలు ప్రారంభం
- స్టాండర్డ్ గా మరెన్నో ఫీచర్లతో వచ్చిన వర్టూస్ కొత్త వెర్షన్లు
ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న వర్టూస్ జిటి లైన్ మరియు జిటి ప్లస్ స్పోర్ట్ వెర్షన్లను మొత్తానికి ఫోక్స్‌వ్యాగన్ ఇండియా లాంచ్ చేసింది. వర్టూస్ జిటి లైన్ మరియు వర్టూస్ జిటి ప్లస్ స్పోర్ట్ అనే ఈ కొత్త వెర్షన్లు వరుసగా రూ.14.07 లక్షలు (ఎక్స్-షోరూం ధర) మరియు రూ.17.84 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో అందుబాటులోకి వచ్చాయి.
ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త వర్టూస్ జిటి లైన్ కారు 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ తో ఈఎస్‍సీ, ఈబీడీ, టిపిఎంఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, అల్యూమినియం పెడల్స్ మరియు గ్రే స్టిచింగ్‌తో బ్లాక్ లెధరెట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లతో వచ్చింది.
ఎక్స్‌టీరియర్ పరంగా, వర్టూస్ జిటి లైన్ కారు బయటి వైపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో బ్లాక్ కలర్లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్, బూట్ లిడ్ స్పాయిలర్, విండో లైన్ మరియు వర్టూస్ లెటరింగ్ వంటి అంశాలను పొందింది. ఇంకా చెప్పాలంటే, ఈ కారు బ్లాక్డ్-అవుట్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, జిటి లైన్ బ్యాడ్జింగ్, బ్లాక్డ్-అవుట్ ఓఆర్‌విఎంస్, మరియు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ని కలిగి ఉంది.
మరో వైపు, వర్టూస్ జిటి ప్లస్ స్పోర్ట్ వెర్షన్ కారు విషయానికి వస్తే, స్టీరింగ్ వీల్ మరియు సీట్ కవర్లపై రెడ్ కలర్ యాక్సెంట్, బ్లాక్డ్-అవుట్ క్యాబిన్, అల్యూమినియం పెడల్స్, రెడ్ యాంబియంట్ లైటింగ్, మరియు బ్లాక్ లెధరెట్ సీట్ అప్హోల్స్టరీ వంటి వాటిని కలిగి ఉంది.
మెకానికల్ గా, వర్టూస్ జిటి ప్లస్ స్పోర్ట్ వెర్షన్ కారులోని 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు. అలాగే, జిటి లైన్ వెర్షన్ కారులోని 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో జత చేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్