- ఇండియా 2.0 ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోలో భాగంగా ఉన్న మోడల్స్
- 5-స్టార్ రేటింగ్ పొందిన రెండు కార్లు
వర్టూస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ మోడల్స్ లోని అన్ని వేరియంట్లు 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా పొందుతున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా, కార్ మేకర్ మరింత జర్మన్-ఇంజినీర్డ్ మరియు సేఫ్ ప్రొడక్ట్స్ ద్వారా దాని కార్ లైనప్ ని విస్తరిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ కాంపాక్ట్ ఎస్‍యూవీ మరియు వర్టూస్ సెడాన్ కార్లకు గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ క్రాష్ టెస్టులలో ఇది వరకే 5-స్టార్ రేటింగ్ లభించింది. ఈ రెండు MQB-A0-IN ప్లాట్ ఫారం అధారంగా రాగా, అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో దగ్గర దగ్గరగా పర్ఫెక్ట్ స్కోరును సాధించాయి. క్రాష్ టెస్టులలో ఈ రెండు కార్ల బాడీ షెల్స్ స్థిరంగా ఉండగా, అధిక లోడింగ్ ని కూడా తట్టుకునేలా వీటి బాడీ తయారుచేయబడింది. 6 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే కాకుండా, ఈ రెండు కార్ల సేఫ్టీ సూట్ లో సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, లోడ్ లిమిటర్లతో సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, ఈబీడీతో ఏఈడీ, ఈఎస్ సీ, మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటివి ఉన్నాయి.
పోర్ట్‌ఫోలియో అంతటా ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ప్రామాణీకరణ గొప్ప చొరవ, ఎందుకంటే భారతదేశంలో కార్ల భద్రతను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. పోర్ట్ ఫోలియోలో ఉన్న మోడల్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా పొందడం ఒక గొప్ప పునాదిగా మారనుంది. ఎందుకంటే, ఇండియన్ గవర్నమెంట్ కూడా కార్లలో సేఫ్టీ స్టాండర్డ్స్ ని పెంచాలని భావిస్తోంది. లక్షకు పైగా 5-స్టార్ గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ-రేటెడ్ ఇండియా 2.0 కార్లు ఫోక్స్‌వ్యాగన్ ద్వారా విక్రయించబడ్డాయి. ఈ మైల్ స్టోన్లో 61 శాతం వాటా ఫోక్స్‌వ్యాగన్ టైగున్ కలిగి ఉండగా, 40 శాతం మంది కొనుగోలుదారులు టాప్-స్పెక్ GT లైన్ వేరియంట్‌లను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు, ఫోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న లోయర్ వేరియంట్లలో కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ ని మెరుగుపర్చడం, అన్వయించడం ద్వారా కస్టమర్లు ఆటోమేటిక్ గా సేఫ్ కార్లను సెలెక్ట్ చేసుకుంటారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్