- అదనపు ఫీచర్లతో వచ్చిన ఫెస్టివ్ ఎడిషన్
- మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో స్పెషల్ ఎడిషన్ లభ్యం
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కొత్తగా టైగున్ లో స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ పేరు ఏంటి అంటే, ఓనమ్ ఎడిషన్. దీని ఎక్స్-షోరూం ధరలు ఇండియాలో ఇప్పుడు రూ.14.08 లక్షలతో ప్రారంభమయ్యాయి. కొత్తగా అందించబడుతున్న ఈ స్పెషల్ ఎడిషన్ వర్టూస్ రేంజ్ లో కూడా అందించబడగా, వర్టూస్ ఓనమ్ ఎడిషన్ ఎక్స్-షోరూం ధరలు రూ.13.57 లక్షలతో ప్రారంభమయ్యాయి.
GTలైన్ వేరియంట్ ఆధారంగా వచ్చిన కొత్త టైగున్ ఓనమ్ ఎడిషన్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్-టోన్ హార్న్, పడిల్ ల్యాంప్స్, మరియు ఫెండర్ పై టిఎస్ఐ బ్యాడ్జి వంటి అప్ డేట్లతో వచ్చింది. మెకానికల్ గా, మిడ్-సైజ్ ఎస్‍యూవీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
కొత్త టైగున్ ఓనమ్ ఎడిషన్ కారులోని అందించబడిన ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ అందుబాటులోకి రాగా, ఈ ఇంజిన్ 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ని 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్లతో జతచేసి పొందవచ్చు. ముఖ్యంగా, ఈ కారులో 1.5-లీటర్ ఇంజిన్ మిస్సయ్యింది.
వేరియంట్-వారీగా టైగున్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ధర (ఎక్స్-షోరూం) |
టైగున్ ఓనమ్ ఎడిషన్ ఎంటి | రూ. 14.08 లక్షలు |
టైగున్ ఓనమ్ ఎడిషన్ ఎటి | రూ. 15.63 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్