- ఒకే ఒక్క 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్
- మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందించబడిన కొత్త మోడల్
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ టైగున్ ఎస్‍యూవీలో జిటి లైన్ మరియు జిటి ప్లస్ స్పోర్ట్ రెండు కొత్త వేరియంట్లను ఇండియాలో లాంచ్ చేసింది. మొదటిది 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ తో అందుబాటులో రాగా, రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. దీని ధరలు వచ్చే నెలలో ప్రకటించనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పేర్కొంది.
ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే, బయటి వైపు కొత్త జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్ గ్లోస్ బ్లాక్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్, డార్క్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కార్బన్ స్టీల్ గ్రే రూఫ్, క్యాసినో బ్లాక్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ఫెండర్ బ్యాడ్జెస్, డిఫ్యూజర్, ట్రపిజోయిడల్ వింగ్ మరియు గ్రిల్, ఫ్రంట్ ఫెండర్స్ మరియు టెయిల్‌గేట్‌పై GT బ్యాడ్జింగ్ వంటి వాటిని పొందింది.
కొత్త టైగున్ జిటిప్లస్ స్పోర్ట్ ని వైల్డ్ చెర్రీ రెడ్, క్యాండీ వైట్, లావా బ్లూ, రిఫ్లెక్స్ సిల్వర్, కురుక్మా ఎల్లో, రైజింగ్ బ్లూ మెటాలిక్ మరియు కార్బన్ స్టీల్ గ్రేతో పాటుగా 7 ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్లలో పొందవచ్చు.
ఇంటీరియర్ పరంగా చూస్తే, టైగున్ కొత్త వేరియంట్లో డ్యూయల్-టోన్ లెదరెట్ సీట్ అప్హోల్స్టరీ, వైల్డ్ చెర్రీ రెడ్ కలర్ స్టిచింగ్, రెడ్ యాంబియంట్ లైటింగ్, బ్లాక్ హెడ్‌లైనర్, ఫ్రంట్ సీట్ బ్యాక్‌రెస్ట్‌లపై GT లోగో, రెడ్ స్టిచింగ్‌తో కూడిన స్పోర్ట్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం పెడల్స్ మరియు బ్లాక్ థీమ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి.
మెకానికల్ గా, టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్‍జి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. ఇది 148bhp మరియు 250Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్