- ఈ నెలలో ప్రారంభంకానున్న డెలివరీలు
- కాంప్లిమెంటరీ సర్వీస్ ప్యాకేజీ లభ్యం
టైగున్ GT లైన్ మరియు GT ప్లస్ స్పోర్ట్‌లను వరుసగా రూ.14.08 లక్షలు మరియు రూ. 18.53 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరలతో ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేసింది. ఇవి గత నెలలో ఆవిష్కరించబడిన ఎస్‌యువి బ్లాక్ స్పోర్ట్-థీమ్ స్పెషల్ ఎడిషన్స్.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ స్పోర్ట్ లో మార్పులు మరియు ఫీచర్స్
ఈ ఎడిషన్స్ కొత్తగా సృష్టించబడిన 'స్పోర్ట్' లైన్ స్ట్రక్చర్ క్రింద స్లాట్ చేయబడ్డాయి. GT 'ప్లస్' కార్బన్ స్టీల్ గ్రే రూఫ్ మరియు ఫ్రంట్ గ్రిల్, ఫెండర్ మరియు టెయిల్‌గేట్‌పై ప్రత్యేకమైన రెడ్ 'GT' బ్రాండింగ్‌ను పొందింది. మరోవైపు, పైన పేర్కొన్న GT లైన్ వేరియంట్‌లో బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్స్ 17-ఇంచ్ 'క్యాసినో' బ్లాక్ అల్లాయ్ వీల్స్ ని పొందగా, కానీ GT ప్లస్ ముందు భాగంలో రెడ్ కాలిపర్స్ ను కలిగి ఉంది. లోపల భాగంలో, బ్లాక్ లెథెరెట్ అప్హోల్స్టరీ తో ఉంది, కానీ కొంత తేడాతో మాత్రమే. ఉదాహరణకు, GT ప్లస్ రెడ్ స్టిచింగ్ ని పొందగా మరియు GT లైన్ గ్రే స్టిచింగ్‌ను పొందుతుంది. అదనంగా, GT ప్లస్ రెడ్ GT లోగోలను, ఇల్యూమినేటెడ్ పెడల్స్ మరియు కాంప్లిమెంటరీతో నాలుగు సంవత్సరాల సర్వీస్ వాల్యూ ప్యాకేజీ (SVP) (ఎస్ విపి) వంటి ప్రారంభ ఆఫర్‌ను అందిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ స్పోర్ట్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ స్పోర్ట్ GT లైన్ 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, GT ప్లస్ స్పోర్ట్ 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడింది, ఇది 148bhp మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండూ ఇంజిన్లు స్టాండర్డ్‌గా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో తో జతచేయబడ్డాయి. అంతేకాకుండా, GT లైన్ 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో పొందవచ్చు, అలాగే GT ప్లస్ 7-స్పీడ్ ట్విన్-క్లచ్ డిఎస్ జితో పొందవచ్చు.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్ మరియు GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్ వారీగా ధర
వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధర |
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్ 1.0లీటర్ టిఎస్ఐ ఎంటి | రూ. 14,08,400 |
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్ 1.0లీటర్ టిఎస్ఐ ఏటి | రూ. 15,63,400 |
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టిఎస్ఐ EVO ఎంటి | రూ. 18,53,900 |
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టిఎస్ఐ EVO డిఎస్ జి | రూ. 19,73,900 |
అనువాదించిన వారు: రాజపుష్ప