- పవర్డ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం
- టాప్-స్పెక్ ఆధారాముగా వేరియంట్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన ఎంక్యుబి ఎస్‌యువి లైనప్ లో వస్తున్న,టైగున్ కొత్త జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్‌ను రిఫ్రెష్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆటోమేకర్ స్పెషల్ ఎడిషన్ ధరలను రేపు అనగా, 2 నవంబర్ 2023న ప్రకటించనుంది.
న్యూ జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్, ఈ పేరు చెప్పిన విధంగానే, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బాడీ డీకాల్స్ మరియు గ్రాఫిక్స్ మరియు బ్లాక్-అవుట్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో గడుసైన రూపాన్ని పొందుతుంది. కలర్ ఆప్షన్ విషయానికొస్తే, రాబోయే ట్రైల్ ఎడిషన్ కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ మరియు డీప్ బ్లాక్ పెర్ల్ ఎక్స్‌టీరియర్ పెయింట్స్ లో అందుబాటులో ఉండనుంది.
లోపలి వైపు, కొత్త ఎడిషన్ కాంట్రాస్టింగ్ రెడ్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ పొంది ఉంది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్స్ తో పోలిస్తే దీనిని సరికొత్తగా చూపించడానికి, జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్ సీట్లు, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు అల్యూమినియం పెడల్స్‌పై ‘ట్రైల్’ను పొందుపరిచింది.
ఫీచర్స్ విషయానికొస్తే, టైగున్ స్పెషల్ ఎడిషన్ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో లోడ్ చేయబడింది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పరంగా చూస్తే , టైగున్ లో జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్ తగినంత పెర్ఫార్మెన్స్ ను ఇంకా అందించలేదుకాబట్టి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా అందించబడుతుంది. ఈ మోటార్ బిఎస్6 ఫేజ్ 2-కంప్లైంట్ అధారంగా 148bhp మరియు 250Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ ఆప్షన్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప