- పవర్డ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకం
- కేవలం టాప్-స్పెక్ వేరియంట్ లో మాత్రమే వచ్చిన జిటి ట్రైల్ ఎడిషన్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియాలో తమ టైగున్ ఎస్‍యూవీ యొక్క కొత్త జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్ ను రూ. రూ.16.30 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ టైగున్ స్పెషల్ ఎడిషన్ మోడల్ కి సంబంధించిన డెలివరీ డిసెంబర్-2023లో ప్రారంభంకానుంది.
కొత్త జిటి ట్రైల్ ఎడిషన్ లో ప్రత్యేకంగా కొంచెం టఫ్ గా కనిపించే ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, బాడీ డీకాల్స్, ప్యానెల్ గ్రాఫిక్స్, మరియు బ్లాక్డ్-అవుట్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ పరంగా చూస్తే, ఇది కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ మరియు డీప్ బ్లాక్ పెర్ల్ ఎక్స్‌టీరియర్ పెయింట్స్ లో అందుబాటులోకి వచ్చింది.
ఇంటీరియర్ పరంగా చూస్తే, ఈ కొత్త ఎడిషన్ లో రెడ్ స్టిచింగ్ తో బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ ఉంది. అదే విధంగా ఇందులో సీట్స్ బ్యాక్ రెస్ట్ లో “ట్రైల్” అనే సింబల్, రెడ్ యాంబియంట్ లైటింగ్, మరియు అల్యూమినియం పెడల్స్ ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఇందులో 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, మరియు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉన్నాయి.
ఇందులో ఉన్న మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, టైగున్ జిటి ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్ పవర్డ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. దీని మోటార్ బీఎస్6 ఫేజ్-2 నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడగా, ఇది 148bhp మరియు 250Nm పీక్ టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఇందులో ఉన్న ట్రాన్స్ మిషన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ యూనిట్ తో కలిపి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్