- ఇండియాలో రూ. 11.70 లక్షలు ప్రారంభ ధరతో ఇప్పుడు టైగున్ లభ్యం
- మూడు మోడళ్లను దేశం అంతటా విక్రయిస్తున్న ఫోక్స్‌వ్యాగన్
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు టైగున్ ల ధరలను 1 జనవరి 2024 నుండి అమలులోకి తెచ్చింది. వివిధ ఆటోమొబైల్ తయారీదారులకి అనుగుణంగా ఈ మోడల్స్ పై ధరల పరిమాణాన్ని కొత్త సంవత్సరం నుండి రెండు శాతం వరకు పెంచుతున్నట్లు కార్‌మేకర్ ఫోక్స్‌వ్యాగన్ గతంలోనే వెల్లడించింది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ లోని ధరలు రూ.8,000 వరకు ఉండగా, ఎంట్రీ-లెవల్ కంఫర్ట్‌లైన్ 1.0 MT వేరియంట్ పై రూ.8,000 వరకు ధరలు పెరగగా, అక్కడి నుండి 1.5GT డిఎస్జి వేరియంట్ వరకు చూస్తే రూ. 41,500 వరకు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఈ మోడల్ ధర రూ.11.56 లక్షల నుండి ప్రారంభమై హై వేరియంట్స్ తో కలిపి రూ. 19.41 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
టైగున్ విషయానికి వస్తే, క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా మరియు ఇతర కార్లకు ప్రత్యర్థిగా ఉన్న మిడ్-సైజ్ ఎస్యువి యొక్క, ఎంట్రీ-లెవల్ కంఫర్ట్‌లైన్ 1.0 MT వేరియంట్ పై రూ. 8,000 వరకు ధరలు పెరగగా, 1.5 GT MT వేరియంట్ తో కలిపి రూ.47,500 వరకు ధరలు పెరిగాయి. దీంతో ఈ మోడల్ ధరలు ఇప్పుడు రూ. 11.70 లక్షల నుండి ప్రారంభమై రూ. 20 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప