- టైగున్ ఎస్‌యూవీపై అత్యధిక డిస్కౌంట్ ని ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్
- క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, మరియుకార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో లభిస్తున్న బెనిఫిట్స్
ఇతర మానుఫాక్చరర్స్ లాగానే ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కూడా సెలెక్టెడ్ మోడల్స్ పై ఫిబ్రవరి-2024లో భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, మరియుకార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. మోడల్-వారీగా ఈ నెల చివరి వరకు అమలులో ఉంటున్న ఆఫర్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఫిబ్రవరి-2024లో ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ పై లభిస్తున్న డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఆఫర్స్ | అమౌంట్ |
క్యాష్ డిస్కౌంట్ | రూ. 10,000 |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ. 30,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ | రూ. 12,000 |
మొత్తం | రూ. 52,000 |
వర్టూస్ మోడల్ మొత్తం కంఫర్ట్ లైన్, హైలైన్, టాప్ లైన్, జిటి, జిటి ప్లస్, మరియు జిటి ప్లస్ ఎడ్జ్ అనే 6 వేరియంట్లలో అందుబాటులో ఉండగా, దీని ధరలు రూ.11.56 లక్షల నుండి ప్రారంభమై రూ. 19.41 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి. వర్టూస్ కి పోటీగా హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి, మరియు స్కోడా స్లావియా వంటి మోడల్స్ ఉన్నాయి.
మరోవైపు టైగున్ పై అత్యధికంగా రూ. 1.30 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఆఫర్స్ | అమౌంట్ |
క్యాష్ డిస్కౌంట్ | రూ. 60,000 |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ. 40,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ | రూ. 30,000 |
మొత్తం | రూ. 1,30,000 |
హుడ్ కింద, స్కోడా కుషాక్ తో పోటీ పడుతున్న ఈ మోడల్ రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడింది. 1.0-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 115bhp మరియు 175Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, 1.5-లీటర్, 4-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఇక ధరల విషయానికి వస్తే, ఈ మోడల్ ధరలు రూ. 11.70 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్