- 2025-చివరిలో లాంచ్ అయ్యే అవకాశం
- 201 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించనున్న కొత్త మోడల్
వియత్నాం దేశానికి చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‍ఫాస్ట్ దాని సరికొత్త సూపర్ మినీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ VF3ని లాస్ వెగాస్ లో జరుగుతున్న 2024కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ మోడల్ ని ఆటోమేకర్ విన్‍ఫాస్ట్ ఇండియాలో అందుబాటులోకి తీసుకురానుంది.
చూడడానికి VF3 చాలా పొడవుగా, బాక్సీ లుక్స్ తో మరియు రోబస్ట్ డిజైన్ తో అద్బుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది. ముందుగా చెప్పాలంటే, , ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు స్క్వేర్డ్ ఓఆర్‌విఎంలతో రెక్టాంగులర్ క్లోజ్డ్ గ్రిల్‌ను పొందుతుంది. తర్వాత వెనుక బంపర్ నుండి వీల్ ఆర్చ్‌ల వరకు మందంగా కనిపించే బ్లాక్ బంపర్ ఉంది. వెనుకవైపు, ఇది ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్ మరియు రెండు చివరలను కలుపుతూ క్రోమ్ ఫినిష్ తో బ్రాండ్ లోగోను కలిగి ఉంది.
VF3 సింగిల్-మోటార్ కాన్ఫిగరేషన్‌తో ఎకో మరియు ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఆటోమేకర్ దాని బ్యాటరీ సైజ్ గురించి ఏ మాత్రం వెల్లడించనప్పటికీ, ఇది ఒకే ఒక్క సింగిల్, ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీలో సుమారు 201 కిలోమీటర్లు (150 మైల్స్) రేంజ్ ని ఈజీ అందుకుంటుందని లక్ష్యంగా కంపెనీ పేర్కొంది. డైమెన్షన్స్ పరంగా, VF3 550 లీటర్ల బూట్ స్పేస్‌తో 3,190ఎంఎం పొడవు, 1,679ఎంఎం వెడల్పు మరియు 1,620ఎంఎం ఎత్తును కలిగి ఉంది.
ఇంటీరియర్ పరంగా చూస్తే లోపల, మినీ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన అడ్వాన్స్డ్ 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు పూర్తిగా ఫోల్డ్ చేసేలా ఉండే రెండవ వరుస సీట్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ ని కూడా కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము.
ఇతర వార్తలలో చూస్తే,విన్‍ఫాస్ట్బ్రాండ్ తమిళనాడులో తన ఫ్యాక్టరీ కోసం నిర్మాణ పనులను ప్రారంభించింది. రాబోయే ఈ మానుఫాక్చరింగ్ యూనిట్ 400 ఎకరాల్లో విస్తరించి 1,50,000 వాహనాల వరకు వార్షిక ప్రొడక్షన్ కెపాసిటీతో 3,500 మంది స్థానికులకు ఉపాధిని కల్పిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ. 4,165 కోట్లు వెచ్చించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్