- ఈసారి సిబియు రూట్ లో రాబోతున్న సూపర్బ్ మోడల్
- ధర రూ.55 లక్షలకు (ఎక్స్-షోరూం) పైగా ఉంటుందని అంచనా
డీలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, స్కోడా ఆటో ఇండియా సూపర్బ్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను 3 ఏప్రిల్ 2024న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఇటరేషన్ ఇండియాలో చివరిగా విక్రయించబడిన లాస్ట్-జనరేషన్ సూపర్బ్ బేస్డ్ గా ఈ మోడల్ డిజైన్ రానుందని మీరు గమనించాలి. గత ఏడాది చివర్లో న్యూ జెన్ మోడల్ ఆవిష్కరించబడింది.
అందిన సమాచారం ఆధారంగా అప్‌డేటెడ్ స్కోడా సూపర్బ్ ఈసారి కేవలం 100 యూనిట్లకు పరిమితం చేయబడనుంది, ఎందుకంటే ఇది ఇండియాలో అసెంబుల్ చేయబడిన దాని మునుపటి వెర్షన్ లాగా కాకుండా సిబియు రూట్ ద్వారా ఇండియన్ మార్కెట్ కి తీసుకురాబడుతుంది. ఇది ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ L&Kవేరియంట్‌లో అందించబడుతుందని మేము భావిస్తున్నాం.
బానెట్ కింద, 2024 స్కోడా సూపర్బ్ లో ఇంతకు ముందు ఉపయోగించిన 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ని ఉపయోగించనున్నారు. ఈ ఇంజిన్ 187bhp మరియు 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 7-స్పీడ్ డిఎస్‍జిఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడి వచ్చిన ఈ కారు కేవలం 7.7 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు.
ముందుగా ఫీచర్ల గురించి చెప్పాలంటే, సూపర్బ్ మోడల్ L&K ప్యాకేజీ, అడాప్టివ్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఎల్ఈడీఫాగ్ లైట్స్, వైర్డు యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేషన్ ఫంక్షన్‌తో 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ మరియు డ్రైవర్ సీటు కోసం మసాజ్ ఫంక్షన్ వంటి ఫీచర్లను పొందనుంది. అలాగే, ఇందులో కాగ్నాక్ అప్‌హోల్‌స్టరీ, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, 9 ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, 360-డిగ్రీ కెమెరాతో కూడిన పార్క్ అసిస్ట్, ఏడీఏఎస్సూట్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (ఈడీఎస్) కూడా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మోడల్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను మిస్ అవ్వనుంది.
కలర్స్ పరంగా, కొత్త సూపర్బ్ మూడు కలర్లలో అందించబడుతుంది, అవి రోసో బ్రూనెల్లో, వాటర్ వరల్డ్ గ్రీన్ మరియు మ్యాజిక్ బ్లాక్. ఇంకా చెప్పాలంటే, ఈ కారు గ్లోబల్-స్పెక్ మోడల్‌లో అందుబాటులో ఉన్న 18-ఇంచ్ కార్ మోడల్స్ లాగా కాకుండా 17-ఇంచ్ వీల్స్ పై నడుస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్