- ఇప్పుడు రెండు వేరియంట్‌లలో అందించబడుతున్న మోడల్
- EQAతో పాటుగా లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ EQB
మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఈరోజు ఇండియాలో EQA మరియు EQB అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను లాంచ్ చేసింది. ఇంతకుముందే మేము దీని గూర్చిన అన్ని వివరాలు మరియు ఈ ఆర్టికల్ ఇప్పుడు మా వెబ్‌సైట్‌లో ఉంచాము. వీటిని మీరు కార్‍వాలే వెబ్‌సైట్‌లో మీరు చూడవచ్చు. ఇందులో, పెద్ద EQB ఇప్పుడు 2024 అప్‌డేటెడ్ వెర్షన్ రూ. 70.9 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
మెర్సిడెస్-బెంజ్ EQBని ఎలక్ట్రిక్ ఆర్ట్ లైన్ మరియు ఏఎంజి లైన్ అనే రెండు రూపాల్లో కస్టమర్లు ఎంచుకోవచ్చు. మునుపటిది పైన పేర్కొన్న ధరకు 7 సీట్స్ లేఅవుట్‌లో అందుబాటులో ఉండగా, రెండోది కేవలం 5 సీట్స్ రూపంలో మాత్రమే రూ. 77.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, 5 సీట్స్ EQBని పొందిన మొట్ట మొదటి మార్కెట్ ఇండియన్ మార్కెట్ అనే చెప్పవచ్చు.
డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే, మెర్సిడెస్-బెంజ్ EQB రెండు కాన్ఫిగరేషన్‌లలో అందించబడింది, ఇది వరుసగాఎలక్ట్రిక్ ఆర్ట్ లైన్ మోడ్ లో 535కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ మరియు ఏఎంజి లైన్ మోడ్ లో 447కిలోమీటర్ల సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
డిజైన్ వారీగా, ఏఎంజి లైన్ లేదా 350 4మాటిక్ (యంగ్) యువ కస్టమర్లను ఆకర్షించడానికి దాని స్టైలింగ్‌తో స్పోర్టియర్ మరియు సంకేతముగాఉంటుంది. అదే విధంగా థీమ్డ్ క్యాబిన్‌తో బయటి వైపున ఉన్న బ్లాక్-అవుట్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. మరోవైపు, ఎలక్ట్రిక్ ఆర్ట్ లైన్ లేదా 250+ వెర్షన్ రెండు అదనపు సీట్లను కలిగి ఉండడమే కాకుండా మొదటి ఉన్న డ్రైవింగ్ రేంజ్ కంటే మెరుగైన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తూ సరికొత్త డిజైన్ అంశాలను కలిగి ఉంటుంది.
మెర్సిడెస్-బెంజ్ EQB ఏఎంజి లైన్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్-వరుస సీట్స్ మరియు డోర్ ప్యానెళ్లపై ఇల్యూమినేటెడ్ స్టార్ప్యాటర్న్స్ తో బ్లాక్-అవుట్ ఇంటీరియర్‌లను కలిగి ఉంది. అలాగే, సేఫ్టీ అంశాల విషయానికి వస్తే, అప్ డేటెడ్ EQBయాక్టివ్ లేన్ కీప్ అసిస్ట్, యాక్టివ్ డిస్టెన్స్ అసిస్ట్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. ఇంకా చెప్పాలంటే, EQB హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ సిస్టమ్ మరియు 12-స్పీకర్ బర్మెస్టర్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్‌తో వచ్చింది.
అనువాదించిన వారు: రాజపుష్ప