- అక్టోబర్ 8 నుండి ప్రారంభంకానున్న సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ డెలివరీలు
- రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందించబడుతున్న మోడల్
సిట్రోన్ ఇండియా అప్‌డేటెడ్C3 ఎయిర్‌క్రాస్‌ను రూ. 8.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త C3 ఎయిర్‌క్రాస్ మరిన్ని ఫీచర్లను పొందడమేకాకుండా , ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది.
అప్‌డేటెడ్ C3 ఎయిర్‌క్రాస్ యు, ప్లస్ మరియు మాక్స్, అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ వేరియంట్ ని రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో పొందవచ్చు. ఇకా ఫీచర్ల విషయానికొస్తే, C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, రియర్ ఏసీ వెంట్స్ , పవర్డ్ వింగ్ మిర్రర్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు రీపొజిషన్డ్ రియర్ పవర్ విండో స్విచ్ వంటి ఫీచర్ల నుండి ప్రయోజనాలను పొందవచ్చు.
మెకానికల్‍గా, C3 ఎయిర్‌క్రాస్ ఇప్పుడు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు. అలాగే, ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
వేరియంట్ వారీగా అప్‌డేట్ చేయబడిన సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
1.2 నేచురల్లీ ఆస్పిరేటెడ్ యు | రూ. 8.49 లక్షలు |
1.2 నేచురల్లీ ఆస్పిరేటెడ్ ప్లస్ | రూ. 9.99 లక్షలు |
1.2 టర్బో ప్లస్ | రూ. 11.95 లక్షలు |
1.2 టర్బో ఏటీ ప్లస్ | రూ. 13.25 లక్షలు |
1.2 టర్బో మాక్స్ | రూ. 12.7 లక్షలు |
1.2 టర్బో ఏటీ మాక్స్ | రూ. 13.99 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప