- వచ్చే నెలలో అరంగేట్రం
- ఇండియా మొదటి టర్బో-పెట్రోల్ సిఎన్‍జి కారు
టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ట్విన్ సిఎన్‍జి సిలిండర్ టెక్ కార్లను పరిచయం చేసింది. ఆ తరువాత బ్రాండ్ నుండి మొదటి సిఎన్‍జి ఆటోమేటిక్ కార్లు అయినా టియాగో మరియు టిగోర్ సిఎన్‍జి వివరాలు వెల్లడి చేసింది. ఇప్పుడు, నెక్సాన్ సిఎన్‌జి రూపంలో ఇండియా మొట్టమొదటి టర్బో-పెట్రోల్ సిఎన్‌జి కారును కూడా పరిచయం చేయడం ద్వారా ఇండియన్ ఆటో మేకర్ మళ్లీ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
ఇంకా చెప్పాలంటే, టాటా నెక్సాన్ సిఎన్‍జి రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందనుంది – అవి, 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్. సిఎన్‍జి –పవర్డ్ కాంపాక్ట్ ఎస్‌యువిలోని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్క్‌ని ఉత్పత్తి చేయనుంది. అయితే, ఈ పవర్ అవుట్ స్టాండర్డ్ పెట్రోల్ మోడ్‌లో లభిస్తుండగా, సిఎన్‍జి వెర్షన్ కొద్దిగా తక్కువ పవర్ తో పనిచేసే ఇంజిన్లను కలిగి ఉంటుంది.
దీంతో, నెక్సాన్ రేంజ్ లో పెట్రోల్, డీజిల్, సిఎన్‍జి మరియు ఎలక్ట్రిక్ వంటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి . ప్రస్తుతం, టాటా మోటార్స్ సిఎన్‍జి లైనప్ లో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ మరియు పంచ్ అనే నాలుగు మోడళ్లను కలిగి ఉంది.
లాంచ్ తర్వాత, టాటా నెక్సాన్ సిఎన్‍జి స్టాండర్డ్ వెర్షన్‌ల కంటే ప్రీమియం రూ. 80,000 ధరను కలిగి ఉండవచ్చు. అలాగే, ఇది కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి కి పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప