- XUV700 ఆధారంగా వస్తున్న రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్
- ఈవీ-స్పెసిఫిక్ ఐఎన్‌జిఎల్ఓ ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్
మహీంద్రా ఇండియాలో రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యువిలలో వేరు వేరుగా ఉన్న మూడు టెస్ట్ మ్యూల్స్ ఇటీవల టెస్టింగ్ చేస్తూ కనిపించాయి. వీటిలో BE.05, XUV.e8 మరియు XUV.e9 వంటి మోడల్స్ ఉన్నాయి, ఇవి రాజస్థాన్‌లోనిఒక మాల్ క్రింద పార్కింగ్ వద్ద వీటిని ఛార్జ్ చేస్తుండగా కనిపించాయి.
ఎక్స్‌టీరియర్
XUV.e8 XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్‌గా ఉన్న మరియు XUV.e9 అనేది XUV.e8 కూపే వెర్షన్ లో పరిగణించబడుతుంది. మరోవైపు, BE.05 అనేది ఇంతకు ముందు ప్రదర్శించబడిన కాన్సెప్ట్ వెర్షన్ ఆధారంగా వస్తున్న మరొక ఈవీకార్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా, XUV.e9 అనేది XUV.e8 కంటే పొడవుగా కనిపిస్తూ ఉండగా, ఈ రెండు కార్లు ఛార్జింగ్ చేస్తుండగా ఒకదానికొకటి ఇక్కడ ఆపి ఉంచిన చిత్రాలను మనం చూడవచ్చు. ఈ రెండు పెద్ద డిఆర్ఎల్స్ తో ఒకే విధమైన ఫాసియాను కలిగి ఉంటాయి. ఈ కార్ లో ఇతర వెహికల్ మాదిరిగా కాకుండా, XUV.e9 వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ కార్లన్నీ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యువి సెగ్మెంట్‌లో లాంచ్ కానున్నాయి.
ఇంటీరియర్
మా వద్ద ఇంటీరియర్ చిత్రాలు లేనప్పటికీ, మునుపటి స్పై చిత్రాలలో మూడు 12.3-ఇంచ్ డిస్‌ప్లేస్ మరియు రెండు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌తో కూడిన ఫ్యూచరిస్టిక్ డ్యాష్‌బోర్డ్ ఇందులో రానున్నట్లు వెల్లడించాయి. అలాగే, ఈవీలలో (వృద్ధిలో ఉండే) ఆగ్మెంటెడ్ నావిగేషన్‌తో కూడిన హెడ్స్-అప్ డిస్‌ప్లే, వెహికల్-టు-లోడ్ ఫంక్షన్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్)వంటి స్పోర్ట్ ఫీచర్‌లను ఇందులో మనం ఆశించవచ్చు.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
ఈ ఈవీలు మహీంద్రా 'బోర్న్ ఎలక్ట్రిక్' రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిలలో ఒక భాగం. అవి సింగిల్-మోటార్ మరియు డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌లలో . 60-80kWh వరకు వివిధ బ్యాటరీ ఆప్షన్ లతో అందించే అవకాశం ఉంది . ఈ కార్లు వేగాన్ని అందించడమే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో ఈవీ కార్లను త్వరగా ఛార్జ్ చేయగలవు.
అనువాదించిన వారు: రాజపుష్ప