- 2024లో రానున్న 2 కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికిల్స్
- ఆగస్టు 2024లో 5-డోర్ థార్ లాంచ్ అయ్యే అవకాశం
మహీంద్రా మరియు దాని ఎస్‍యూవీలు ఎల్లప్పుడూ ఆటో ఇండస్ట్రీలో వెలుగుతూనే ఉన్నాయి మరియు వచ్చే ఏడాది 2024లో 5 కొత్త ఎస్‍యూవీలను పరిచయం చేయాలని ఈ దిగ్గజ భారతీయ కార్ల తయారీ సంస్థ భావిస్తోంది. అందుకోసం, 2024లో ఇండియాలో రాబోయే మహీంద్రా కార్లను మేము ఇక్కడ లిస్టులో పొందుపరిచాం, వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
5-డోర్ థార్
2024లో మహీంద్రా ఎస్‍యూవీ నుంచి వస్తున్న 5-డోర్ థార్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టెస్టింగ్ చేస్తూ ఇది ఎన్నోసార్లు కనిపించగా, ప్రస్తుత అవుట్‌గోయింగ్ వెర్షన్ తో పోలిస్తే దాని కంటే పొడవుగా ఉండనుంది మరియు సన్‌రూఫ్ మరియు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అమర్చబడి ఉండనుంది. ఇంకా చెప్పాలంటే, ఇది పాపులర్ వర్టికల్ స్ట్రట్స్ తో రివైజ్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌తో రానున్నాయి. ఈ 5-డోర్ థార్ ఆగస్టు-2024లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్
మహీంద్రా కంపెనీ తమ కొత్త సంవత్సరాన్ని ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ లాంచ్ చేసి ఘనంగా ప్రారంభించనుంది. ఈ మిడ్-సైజ్ ఎస్‍యూవీ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది మరియు కొత్త మరియు పెద్ద హెడ్‌ల్యాంప్స్ మరియు మరింత ఆకట్టుకునేలా కనిపించే కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్ కలిగి ఉండనుంది. అలాగే, ఎక్స్‌యూవీ300 రివైజ్డ్ 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు మరిన్ని కొత్త ఫీచర్స్ తో రానుంది. ఇది వరకే ఈ మహీంద్రా కారు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ స్కోర్ చేసింది.
ఎక్స్‌యూవీ400 ఫేస్‍లిఫ్ట్
ఎక్స్‌యూవీ300 తర్వాత అప్ డేటెడ్ ఇటరేషన్ ఈవీ వెర్షన్ లో దానిని అనుసరిస్తూ ఈ ఎక్స్‌యూవీ400 వచ్చింది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలో ఓకే రకమైన స్టైలింగ్ ట్వీక్స్, కొత్త వీల్స్ మరియు రివైజ్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనున్నాయి. అయితే, మొత్తానికిమేము ఎస్‍యూవీయొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులను ఆశించడం లేదు మరియు ఇది 34.5kW మరియు 39.4kW బ్యాటరీ ప్యాక్స్ ద్వారా వరుసగా 375 కి.మీ.మరియు 476 కి.మీ.ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది.
ఎక్స్‌యూవీ700 & కెప్టెన్ సీట్ వెర్షన్
2024 చివరిలోపు మహీంద్రా నుంచి వస్తున్న 2వ ఈవీగా ఎక్స్‌యూవీ.e8 అరంగేట్రం చేయనుంది. ఐసీఈ ఎక్స్‌యూవీ700 ఆధారంగా రానున్న దీని స్పై పిక్చర్స్ చూస్తే కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్‌ల్యాంప్స్, కొత్త డ్రైవ్ సెలెక్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మెరుగైన ఇంటర్‌ఫేస్ వంటి వివరాలను మనం గమనించవచ్చు.
నియో ప్లస్
చాలా కాలం నుంచి బొలెరో నియో అందుబాటులో ఉండగా, ఈ ఆటోమేకర్ సరికొత్తగా నియో ప్లస్ అని పిలవబడే ఒక లాంగ్ వెర్షన్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఎస్‍యూవీకి సంబంధించిన లాంచ్ టైంలైన్ వివరాల గురించి మహీంద్రా కంపెనీ ఏమాత్రం పెదవి విప్పడం లేదు కానీ, ఈ మహీంద్రా కారు 2024లో ఎప్పుడైనా పరిచయం చేయబడుతుందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్