- 19 లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) ఫీచర్స్ దీని సొంతం
- జనవరి 16న లాంచ్ కానున్న క్రెటా ఫేస్‍లిఫ్ట్
ఈ నెల ప్రారంభంలో, చాలా రోజులుగా కస్టమర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రెటా ఫేస్లిఫ్ట్ యొక్క బుకింగ్స్ ని హ్యుందాయ్ ఇండియా ప్రారంభించింది. ఇండియాలో క్రెటా ఫేస్‍లిఫ్ట్ మోడల్ జనవరి 16, 2024న లాంచ్ కానుంది. అయితే, కొత్త క్రెటాకు సంబంధించి వేరియంట్స్, కలర్స్, మరియు ఇంజిన్స్ వివరాలు ఇది వరకే మేము మీకు తెలియజేశాము. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ ఆల్-న్యూ క్రెటా ఎస్‍యూవీ యొక్క సేఫ్టీ ఫీచర్స్ తో సహా పూర్తి ఫీచర్స్ లిస్టును వెల్లడించింది.
ఈ కొరియన్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ అనే లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) సూట్ తో అందించబడుతుంది. అలాగే, ఈ కార్ మేకర్ కొత్త క్రెటాలో 70 సేఫ్టీ ఫీచర్లను అందిస్తుండగా అందులో 36 ఫీచర్లు 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంకా మరెన్నో ఫీచర్లతో కలిపి అన్నీ వేరియంట్లలో ఉండనున్నాయి.
ఇంకా చెప్పాలంటే, క్రెటా ఫేస్లిఫ్ట్ యొక్క నిర్మాణం మరియు బాడీ స్ట్రక్చర్ ఎంతో దృడంగా, అన్నింటిని తట్టుకునేలా ఉండనుంది. బ్రాండ్ ప్రకారం, ఇందులో ఉన్న ప్యాసింజర్లకు రక్షణ కవచంలా ఉండేందుకు అధునాతనమైన మరియు అధిక-బలం కలిగి ఉన్న స్టీల్ ని క్రెటా ఫేస్‌లిఫ్ట్ తయారు చేసేందుకు ఉపయోగించారు.
ఇందులో ఉన్న మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, క్రెటా ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే 3 పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో రానుంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, సివిటి, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్