- ఫ్రాంక్స్-బేస్డ్ క్రాస్ ఓవర్ గా లాంచ్ అయిన టైజర్ మోడల్
- టయోటా బ్రాండింగ్ ద్వారా అధికారిక యాక్సెసరీస్ పొందిన అర్బన్ క్రూజర్ టైజర్
టయోటా బ్రాండ్ ఈ నెలలో అర్బన్ క్రూజర్ టైజర్ ని లాంచ్ చేసింది. కార్ మేకర్ దీని లాంచ్ తో పాటుగా వేరియంట్-వారీగా ధరలను కూడా ప్రకటించగా, క్రాస్ ఓవర్ లో లభించే టాప్ యాక్సెసరీస్ ని కూడా లిస్టు చేసింది. కస్టమర్లు దీనిని కస్టమైజ్ ఆప్షన్ లో ఎంచుకోవాలంటే తప్పనిసరిగా టైజర్ లో ఈ టాప్-5 యాక్సెసరీస్ ఉండే విధంగా కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు.
క్రోమ్ యాక్సెంట్స్
చాలా వరకు ఇండియన్ కస్టమర్లు ఇష్టపడుతున్నట్లుగా కార్ల కంపెనీలు అన్ని క్రోమ్ యాక్సెసరీస్ ని అందిస్తున్నాయి. అలాగే, టయోటా షైనీ యాక్సెంట్స్, హెడ్ ల్యాంప్ గార్నిష్ మరియు ఓఆర్‌విఎం కవర్ ని కూడా అందిస్తుంది. ఇలాంటి మరెన్నో అందమైన వాటిని కస్టమర్ల అభీష్టానికి అనుగుణంగా, వారి అవసరాలకు అనుగుణంగా ఎంచుకునే సౌకర్యం ఉంది.
ప్రొటెక్టివ్ ప్యానెల్స్
ఇంకా, ఈ క్రాస్ ఓవర్ కి సంబంధించిన ప్రొటెక్టివ్ యాక్సెసరీస్ ఒక ప్యాకేజీగా లేదా వ్యక్తిగతంగా ఎంచుకోవచ్చు. ఇందులో బాడీ-సైడ్ మౌల్డింగ్, మరియు రియర్ బంపర్ గార్నిష్ (గ్రానైట్ గ్రే మరియు రెడ్) వంటివి ఉన్నాయి. చూడడానికి ఇవన్నీ చిన్నగా కనిపించినా, ఈ ప్రాక్టికల్ యాక్సెసరీస్ పెయింట్ ని ఎలాంటి డైరెక్ట్ డ్యామేజ్ కి గురికాకుండా సహాయపడతాయి. గ్లాంజాలో లభించే బంపర్ కార్నర్ ప్రొటెక్టర్స్ మరియు డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్స్ వంటి ఇతర యాక్సెసరీస్ ని ఇందులో కూడా పొందవచ్చు.
డోర్ వైజర్స్
రెయిన్ వైజర్లుగా పిలిచే డోర్ వైజర్లను కూడా కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. గుడ్ లుక్స్ మరియు ప్రాక్టికాలిటీతో వీటిని క్రోమ్ స్ట్రిప్ తో పొందవచ్చు.
రూఫ్-ఎండ్ స్పాయిలర్ ఎక్స్‌టెండర్
టైజర్ లుక్ ని మరింత మెరుగుపరచడానికి, కారు వెనుక భాగంలో ఒక స్పాయిలర్ ని అందించగా, దీనిని బ్లాక్ గ్లోస్ మరియు రెడ్ కలర్ లో పొందవచ్చు.
ఇంటీరియర్ స్టైలింగ్ కిట్
ఇంకా చెప్పాలంటే, టైజర్ ఇంటీరియర్ ని వివిధ యాక్సెసరీస్ ద్వారా మొత్తంగా లేదా వ్యక్తిగతంగా పర్సనలైజ్ చేసి పొందవచ్చు. ఇందులో స్టీరింగ్ వీల్ కవర్స్, సీట్ కవర్స్, మరియు త్రీడీ బూట్ మ్యాట్ ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ పవర్ ట్రెయిన్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ వలె ఉన్న టైజర్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు స్టాండర్డ్ గా లభిస్తుండగా, ఎఎంటితో 1.2-లీటర్ ఇంజిన్ ని, మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ తో 1.0-లీటర్ ఇంజిన్ ని పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఇది సిఎన్‍జి వేరియంట్లో కూడా అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్