- రూ.20,160 విలువైన యాక్సెసరీస్ పొందే అవకాశం
- అక్టోబర్ 2024 చివరి వరకు అందుబాటులో ఉన్న మోడల్
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఇండియన్ మార్కెట్లో అర్బన్ క్రూజర్ టైజర్ ఫెస్టివ్ ఎడిషన్ వెర్షన్‌ను నేడే లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టిజిఎ) రేంజ్ ని పొందుతుంది. దీనిని రూ. 20,160 ధరతో పొందవచ్చు. అలాగే ఇక్కడ గుర్తించదగిన అంశాలు ఏమిటంటే, కస్టమర్లకు ఈ ఆఫర్ అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అలాగే, ఈ కారు టర్బో-పెట్రోల్ వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఫెస్టివ్ ఎడిషన్ టయోటా టైజర్‌లో రెడ్ మరియు గ్రానైట్ గ్రే, డోర్ సిల్ గార్డ్‌లు, గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్స్కోసం క్రోమ్ ఇన్సర్ట్స్ , బాడీ సైడ్ మౌల్డింగ్, డోర్ వైజర్ వంటి స్పాయిలర్ కింద ఫ్రంట్ మరియు రియర్ భాగాలలో మరింత మెరుగైన అప్ డేట్లను పొందింది. అలాగే, 3D మాట్స్ మరియు వెల్కమ్ డోర్ ల్యాంప్ వంటివి ప్యాకేజీ కాంప్లిమెంటరీగా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, స్టాండర్డ్ ఎడిషన్‌తో పోల్చినప్పుడు ఈ కొత్త ఎడిషన్ ధరలు రూ. 10.55 లక్షలు నుండి రూ. 13.03 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ఫెస్టివ్ ఎడిషన్ 1.0-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 99bhp మరియు 148Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ వంటివి ఉన్నాయి. టైజర్ కారు 21.5కెఎంపిఎల్ వరకు మైలేజీని అందిస్తుందని టయోటా కంపెనీ పేర్కొంది.
పండుగ సీజన్‌లో ఈ ఎడిషన్‌ను పరిచయం చేయడంపై టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, సర్వీస్ మరియు యూజ్డ్ కార్ల వ్యాపారం వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “టొయోటాలో, మా ప్రయత్నాలు ఎల్లప్పుడూ మా కస్టమర్‌ల ప్రత్యేక సందర్భాలలో భాగం కావడంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. మరియు సంతోషకరమైన, కస్టమర్-కేంద్రీకృత అనుభవాలను రూపొందించడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబించే వేడుకలు. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ఇటీవలే పరిచయం చేసిన తర్వాత, ఈ పండుగ సీజన్‌లో తాజా మరియు ఉత్తేజకరమైన వాటిని అందించడానికి రూపొందించబడిన అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫెస్టివ్ ఎడిషన్‌ను అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ కొత్త జోడింపులో మా కస్టమర్‌లు గొప్ప విలువను పొందుతారని మేము విశ్వసిస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప