ఇండియాలో రూ.11.14 లక్షల నుండి ప్రారంభంకానున్న హైరైడర్ ధరలు
రూ.19.77 లక్షల నుండి ప్రారంభంకానున్న ఇన్నోవా హైక్రాస్ ధరలు
టయోటా కిర్లోస్కర్ మోటార్ జనవరి-2024లో తమ మోడల్స్ పై ఉన్న వెయిటింగ్ పీరియడ్ ని ప్రకటించింది, అందులో ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి మోడల్స్ ఉన్నాయి. లాంచ్ అయినప్పటి నుంచి టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ పై వెయిటింగ్ పీరియడ్ సుదీర్ఘంగా ఉన్నా, ఎట్టకేలకు ఇది కాస్త దిగివచ్చింది. అదే విధంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700తో పోటీ పడుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ పై కూడా వెయిటింగ్ పీరియడ్ మరింతగా తగ్గింది. ఆయా మోడల్స్ పై వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది అనే వివరాలను కింద లిస్టులో పొందుపరిచాము. ఇప్పుడు మనం వాటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
ప్రస్తుతం, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడల్ ను E, S, G, మరియు V అనే 4 వేరియంట్లలో మరియు నియో డ్రైవ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్లలో అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ. 11.14 లక్షల నుండిరూ. 20.19 లక్షలు (అన్నీ ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉంది.
అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడల్ లోని సిఎన్‍జి వేరియంట్లకు కస్టమర్స్ నుంచి అధిక డిమాండ్ కారణంగా, వీటిపై 14 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. హైబ్రిడ్ మరియు నియో-డ్రైవ్ మోడల్స్ పై వరుసగా 5 నెలలు మరియు 9 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ చేసిన తేదీ నుండి ప్రాంతం, డీలర్షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్
ఇన్నోవా హైక్రాస్ ఎంపివిని టయోటా మోటార్స్ GX, GX లిమిటెడ్ ఎడిషన్, VX, VX(O), ZX, మరియు ZX(O)అనే 6 వేరియంట్లలో మరియు 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందిస్తుంది. ఈ మోడల్ ధరలు రూ.19.77 లక్షలు నుండి ప్రారంభమై రూ.30.68 లక్షలు(ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి.
ప్రస్తుతం, హైక్రాస్ యొక్క పెట్రోల్ వేరియంట్లపై 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, మరొక వైపు పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లపై వెయిటింగ్ పీరియడ్ 15 నెలల నుంచి 14 నెలలకు తగ్గింది. ఈ వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ చేసిన తేదీ నుండి ప్రాంతం, డీలర్షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్