- 'బ్యాటరీ 3R' అంటే రిడ్యూస్, రీబిల్ట్/రీయూజ్, మరియు రీసైకిల్
- 2035 నాటికి కార్బన్ సమతుల్యతను సాధించాలన్నదే దీని లక్ష్యం
టయోటా తమ ఓల్డ్ ఎలక్ట్రిఫైడ్ కార్ల బ్యాటరీల సర్వీస్ లైఫ్ ముగియడంతో వాటిని తిరిగి అమర్చనున్నట్లు ప్రకటించింది. 'బ్యాటరీ 3R' ప్రోగ్రామ్ ద్వారా ఈ ఓల్డ్ హైబ్రిడ్ కార్ బ్యాటరీలతో 2035 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని పొందాలని జపాన్ కార్ల తయారీదారుల లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సర్క్యులారిటీ ప్లాన్ ఆటోమోటివ్ లేదా నాన్-ఆటోమోటివ్ అప్లికేషన్‌లలో ఉపయోగిస్తున్న హైబ్రిడ్ బ్యాటరీలకు రెండవ అవకాశం ఇవ్వనుంది. పైన చెప్పబడిన బ్యాటరీల వినియోగం ముగింపు దశకు చేరుకుందని నిర్ధారించబడినప్పుడు, కంపెనీ వాటిని కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే విధంగా రీసైకిల్ చేస్తుంది మరియు కొత్త బ్యాటరీ ఉత్పత్తికి స్టాక్ ఫీడ్‌గా వీలైనంత ఎక్కువ పదార్థాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టనర్స్ సహకారంతో, 'బ్యాటరీ 3R' లో భాగంగాబ్రాడర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీని టయోటా అమలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్నవారికి ఉపాధిని కల్పించనుంది. ప్రారంభంలో - జపాన్, యూఎస్, యూరోప్, చైనా మరియు ఆసియా అనే 5 ప్రాంతాలలో 3R అమలు చేయబడుతుంది.
టయోటాలో మొదటగా ప్రారంభమైన ప్రియస్ వంటి హైబ్రిడ్ కార్లు ఇప్పటికే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున, అటువంటి కార్ల నుండి కొన్ని బ్యాటరీలను సరైన పద్దతిలో తొలగించడం చాలా అవసరం. ఈ చొరవ ద్వారా కార్‌మేకర్ ఓల్డ్ బ్యాటరీలలో కొంత భాగాన్ని తిరిగి ఉపయోగించడమే కాకుండా, మరియు కొత్త బ్యాటరీల ఖర్చును తగ్గిస్తుంది; ఇది కొత్త రసాయనాలకు అనుగుణంగా కొత్త బ్యాటరీల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది, ఓల్డ్ బ్యాటరీల ద్వారా ప్యూర్ ఈవీలు మాత్రమే కాకుండా హెచ్ఈవీఎస్, పిహెచ్ఈవీఎస్ మరియు ఎఫ్‍సిఈవీఎస్ లుకు కూడా ప్రయోజనం పొందనున్నాయి. చివరగా, టయోటా ఈ యూజ్డ్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్ స్టోరేజ్ బ్యాటరీల కోసం స్టేషనరీ స్టోరేజ్ బ్యాటరీ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప