- సుమారుగా ఒక శాతం మేర అప్‌డేట్ చేయబడనున్న ధరలు
- వచ్చే నెల నుండి ధరలను పెంచనున్న ఇతర ఓఇఎంఎస్
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) తన మోడల్ ధరలను 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచనున్నట్లు వెల్లడించింది. మొదటి సారి ఈ ఏడాది జనవరిలో ధరలు పెంచడం జరిగి నందున ఇప్పుడు ఆటోమేకర్ రెండోసారి తన అన్ని కార్ల పై ధరలను పెంచింది.
టయోటా ప్రకారం, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు మరియు కార్యాచరణ ఖర్చుల కారణంగా ధరలు పెంచబడతాయి. టయోటాతో పాటు, హోండా కార్స్ ఇండియా మరియు కియా ఇండియా కూడా తమ మోడల్స్ ధరలను పెంచనున్నాయి, రాబోయే రోజుల్లో ఇతర బ్రాండ్స్ ఈ బ్యాండ్ వాగన్‌లో చేరవచ్చని భావిస్తున్నారు.
టయోటా ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్లాంజా, రూమియన్, ఇన్నోవా హైరోస్, వెల్‌ఫైర్, ఫార్చూనర్, ఫార్చూనర్ లెజెండర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ల్యాండ్ క్రూయిజర్, హిలక్స్ మరియు ఇన్నోవా క్రిస్టాతో సహా 11 కార్లను విక్రయిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో ఫ్రాంక్స్-బేస్డ్ టైసర్ రాకతో ఈ లిస్ట్ త్వరలో మరింతగా పెరగనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప