- ఇండియాలో రూ. 7.73 లక్షలతో ప్రారంభమైన టైజర్ ధరలు
- ఐదు వేరియంట్లు మరియు ఎనిమిది కలర్లలో అందించబడుతున్న టైజర్
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) అర్బన్ క్రూజర్ టైజర్ మోడల్ ని రూ. 7.73 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు మేము ఈ మారుతి ఫ్రాంక్స్-బేస్డ్ కారుకు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలను కలిగి ఉన్నాము.
జూన్-2024 నాటికి, టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ రెండు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉంది. అంటే, ఈ మోడల్ ని మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే, దీని కోసం మీరు రెండు నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ టైమ్ లైన్ పాన్-ఇండియా లెవెల్ లో ఒకే విధంగా ఈ మోడల్ పై వర్తించనుంది. లేటెస్టుగా టయోటా టైజర్ ని మేము డ్రైవ్ చేయగా, దీనికి సంబంధించిన రివ్యూ ప్రస్తుతం మా వెబ్ సైట్లో అందుబాటులో ఉంది.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, ఎఎంటి, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు టైజర్ మోడల్ ని ఎనిమిది కలర్లలో మరియు ఐదు వేరియంట్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్