- సంయుక్తంగా కార్లను అందిస్తున్న టయోటా-మారుతి
- పవర్ ఫుల్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని పొందిన టయోటా టైజర్ మరియు మారుతి ఫ్రాంక్స్
మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా టయోటా టైజర్ మోడల్ కార్ మేకర్ నుంచి లేటెస్టుగా అందించబడింది. ఈ రెండు కార్లలో ఎక్స్‌టీరియర్ కాస్మోటిక్ మార్పుల పరంగా కాస్త తేడా ఉన్నా, బాడీ షెల్, ఇందులోని ఫీచర్లు, పవర్ ట్రెయిన్ ఆప్షన్లు మాత్రం ఒకేలా ఉన్నాయి. టయోటా మరియు మారుతి సుజుకి సంయుక్తంగా కొత్త ప్రొడక్టులను తీసుకురావడం కొత్తేం కాదు. వీటిని నుంచి వచ్చిన క్రాస్-బ్యాడ్జ్డ్ ప్రొడక్ట్స్ విజయవంతంగా దేశవ్యాప్తంగా విక్రయించబడుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే, ఫ్రాంక్స్ మరియు టైజర్ సేల్స్ ఒకేలా ఉన్నాయి. కానీ, ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటి అంటే, అది మైలేజీ. ఈ ఆర్టికల్ ద్వారా, ఫ్రాంక్స్ మరియు టైజర్ రియల్ వరల్డ్ మైలేజీని ఓసారి తెలుసుకుందాం.
ఇంజిన్ ఆప్షన్స్: టైజర్ వర్సెస్ ఫ్రాంక్స్
టైజర్ మరియు ఫ్రాంక్స్ కార్లలో అందించిన ఇంజిన్ ఆప్షన్లను చూస్తే, ఈ రెండు కార్లు ఒకే రకమైన ఇంజిన్ ని మరియు గేర్ బాక్స్ ఆప్షన్లను షేర్ చేసుకుంటున్నాయి. అందులో 1.2-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. పోల్చి చూడడానికి మేము 99bhp మరియు 147Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని ఉపయోగించగా, దీనిని 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ లేదా 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. మారుతి ఫ్రాంక్స్ కారు 21.1కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని ఏఆర్ఏఐ క్లెయిమ్ చేయగా, టైజర్ మైలేజీ వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు. ఇప్పుడు మనం ఈ రెండు కార్లలో ఏ కారు ఎంత రియల్-వరల్డ్ మైలేజీ అందిస్తుందో వాటి వివరాలను తెలుసుకుందాం.
సిటీ మైలేజీ
మేము మైలేజీ టెస్టును నిర్వహించడానికి ఫ్రాంక్స్ మరియు టైజర్ కార్లు అవసరం కాగా, ఈ రెండింటిని ఒకేరోజు ఒకే రూట్ లో డ్రైవ్ చేశాము. సిటీలో ఫ్రాంక్స్ కారు 14.3కెఎంపిఎల్ మైలేజీని అందించగా, 15.2కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు మల్టీ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లేలో నమోదైంది. మరోవైపు, టైజర్ వెర్షన్ 14.72కెఎంపిఎల్ మైలేజీని అందించగా, 15.3కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు మల్టీ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లేలో నమోదైంది.
హైవే మైలేజీ
ఇంకా హైవే విషయానికి వస్తే, హైవేపై టైజర్ కారును డ్రైవ్ చేస్తుండగా, భారీ వర్షంతో కొంత వరకు అవరోధాలు ఎదురుకాగా, ఫ్రాంక్స్ కారును టెస్ట్ చేస్తున్నపుడు, డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఫ్రాంక్స్ ఫ్యూయల్ ఎకానమీని చూస్తే, 19.1కెఎంపిఎల్ మైలేజీని అందించగా, దానికి సరిసమానంగా టైజర్ కారు 18.68కెఎంపిఎల్ మైలేజీని అందించింది. ఈ రెండు కార్లు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్లో 21-22కెఎంపిఎల్ అందిస్తున్నట్లు చూపించింది. ఈ రెండు కార్లు 37 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉండగా, ఫుల్ ట్యాంకుతో వీటిని 500 కిలోమీటర్లకు పైగా ఈజీగా డ్రైవ్ చేయవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్