- ఇండియాలో రూ. 7.73 లక్షలతో ప్రారంభమైన టైజర్ ధరలు
- వచ్చే నెల నుండి టైజర్ డెలివరీ ప్రారంభం
బుధవారం నాడు అనగా ఏప్రిల్ 3వ తేదీన టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) అర్బన్ క్రూజర్ టైజర్ ని రూ.7.73 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరలతో లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఈ మోడల్ బుకింగ్స్ రూ.11,000 టోకెన్ అమౌంట్ తో ప్రారంభమవగా, వీటి డెలివరీ మే-2024 నుంచి ప్రారంభంకానుంది.
టయోటా టైజర్ ఇప్పుడు 8 కలర్లలో అందుబాటులోకి రాగా, అందులో 5 మోనోటోన్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్లు ఉన్నాయి. మోనోటోన్ ఆప్షన్లలో లూసెంట్ ఆరెంజ్, స్పోర్టిన్ రెడ్, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, మరియు గేమింగ్ గ్రే ఉండగా, డ్యూయల్-టోన్ ఆప్షన్లలో స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్, మరియు కేఫ్ వైట్ ఉన్నాయి. ఇవన్నీ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ ని పొందాయి.
ముందుగా వేరియంట్స్ గురించి చెప్పాలంటే, 2024 అర్బన్ క్రూజర్ టైజర్ ని కస్టమర్లు E, S, S+, G, మరియు V అనే 5 వేరియంట్లలో ఎంచుకోవచ్చు. సిఎన్జి వెర్షన్ టైజర్ లోని ఎంట్రీ-లెవెల్ E వేరియంట్ కి మాత్రమే పరిమితం చేయబడగా, టర్బో-పెట్రోల్ ఇంజిన్ G మరియు V వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
బానెట్ కింద, కొత్త టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఎఎంటి, మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ తో అనే మూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్