- గత నెలతో పోలిస్తే 66శాతం ఎక్కువగా నమోదైన వార్షిక వృద్ధి రేటు
- ప్రస్తుత సంవత్సరం మొదటి 10 నెలల్లో 40శాతానికి పైగా నమోదైన వృద్ధి రేటు
టయోటా కిర్లోస్కర్ మోటార్(టికెఎం) అక్టోబర్-2022లో 13,143 యూనిట్లను విక్రయించగా, ఈ సంవత్సరం అక్టోబరులో 21,879 యూనిట్లను విక్రయించి, గత సంవత్సరంతో పోలిస్తే 66 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. మొత్తం సేల్స్ ని నంబర్స్ పరంగా చూస్తే, డొమెస్టిక్ మార్కెట్లో 20,542 యూనిట్లను విక్రయించగా, 1,337 యూనిట్లను ఎగుమతి చేసింది.
ప్రస్తుత సంవత్సరం మొదటి 10 నెలల్లో టయోటా కిర్లోస్కర్ మోటార్(టికెఎం) 1,92,661 యూనిట్లను విక్రయించగా, గత సంవత్సరం ఇదే పీరియడ్ లో 1,38,190 యూనిట్లను విక్రయించింది. దీనిని గత సంవత్సరంతో పోల్చి చూస్తే 40శాతం వృద్ధి రేటును నమోదు అయింది.
అయితే దీని మోడల్స్ పై ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండగా, టయోటా ఇండియా తాజాగా ప్రొడక్షన్ కెపాసిటీని 3 షిఫ్టులకు పెంచింది. గత నెలలో, టయోటా బ్రాండ్ ఫార్చూనర్ ధరలను ఎస్‍యూవీ ధరలను రూ.70,000 పైగా పెంచింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్