- ఇండియాలో రూ. 10.29 లక్షలతో రూమియన్ ధరలు ప్రారంభం
- 5 కలర్స్ మరియు 3 వేరియంట్లలో లభ్యం
జనవరి-2024లో టయోటా కార్లపై ఉన్న అప్డేటెడ్ వెయిటింగ్ పీరియడ్ వివరాలు వెల్లడయ్యాయి. ఇండియాలో రూమియన్ ఎంపివి ధర రూ. 10.29 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి మొదలుకానుంది. ఈ ఆర్టికల్ లో, మనం ఎర్టిగా బేస్ మోడల్ అయిన రూమియన్ వెయిటింగ్ పీరియడ్ వివరాలు మీకు తెలియజేయబోతున్నాము.
ప్రస్తుతం జనవరి-2024లో టయోటా రూమియన్పై సుమారుగా 7 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. గత నెలలో ఉన్న 6 నెలల వెయిటింగ్ పీరియడ్ తో పోలిస్తే, ఇది కాస్త పెరగగా, ఈ రెండూ కూడా పెట్రోల్ వెర్షన్లపై వర్తిస్తాయి. దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా టయోటా కంపెనీ ఈ మోడల్ యొక్క బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇంకా చెప్పాలంటే, టయోటా రూమియన్ ఎంపివి యొక్క పవర్డ్ 1.5-లీటర్, 4-సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 102bhp మరియు 137Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లతో జత చేయబడింది. ఈ మోడల్ ని కస్టమర్లు మొత్తం S, G, మరియు V అనే 3 వేరియంట్లలో 5 కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్