- ఇండియాలో రూ. 10.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభంకానున్న ధరలు
- 5 ఎక్స్‌టీరియర్ కలర్స్ మరియు 3 వేరియంట్స్ లో లభ్యం
మారుతి సుజుకి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్, రూమియన్ను టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఆగస్టు 2023లో ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఇండియాలో దీనికి లభిస్తున్న అద్బుత స్పందన కారణంగా, కొన్ని రోజుల నుంచి ఈ 7-సీటర్ ఎంపివి అసాధారణమైన వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. ప్రస్తుతం, తాజాగా రూమియన్‌ఫై ఉన్న వెయిటింగ్ పీరియడ్ గురించి మనం ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం, ఒకవేళ మీరు రూమియన్ ఎంపివి యొక్క పెట్రోల్ వేరియంట్ ని కొనుగోలు చేయాలని భావిస్తే, మీరు బుకింగ్ చేసిన తేదీ నుంచి 5-6 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ తాజా వెయిటింగ్ పీరియడ్ ప్రాంతం, నగరం, డీలర్షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా, మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఆటోమేకర్ రూమియన్ యొక్క సిఎన్‍జి వేరియంట్స్ బుకింగ్స్ ను స్వీకరించడం నిలిపివేసింది.
కియా కారెన్స్ తో పోటీపడుతున్న టయోటా రూమియన్ S, G, మరియు V అనే 3 వేరియంట్స్ లో 5 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో అందుబాటులో ఉంది. కలర్స్ ఏవి అంటే, స్పంకీ బ్లూ, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, ఐకానిక్ గ్రే మరియు మోటైన బ్రౌన్. ఇందులోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, దీని 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 102bhp మరియు 137Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది మరియు 20.5కెఎంపిఎల్ వరకు ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని అందిస్తుంది. అదే విధంగా, ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్